5 Hydration Fruits: రోజంతా హైడ్రేషన్ అందించే 5 రకాల పండ్లు.. మీ డైట్ లో ఉన్నాయా?
5 Hydration Fruits: ఎండ వేడిమి పెరుగుతుంది రోజంతటికి తగిన హైడ్రేషన్ అందించడానికి తరచుగా నీళ్లు లిక్విడ్స్ రూపంలో ఉన్న ఆహారాలు తీసుకుంటాం. అయితే కొన్ని రకాల పండ్లు కూడా మన రోజంతాటి కావాల్సిన హైడ్రేషన్ అందిస్తాయి.
5 Hydration Fruits: ఎండ వేడిమి పెరుగుతుంది రోజంతటికి తగిన హైడ్రేషన్ అందించడానికి తరచుగా నీళ్లు లిక్విడ్స్ రూపంలో ఉన్న ఆహారాలు తీసుకుంటాం. అయితే కొన్ని రకాల పండ్లు కూడా మన రోజంతాటి కావాల్సిన హైడ్రేషన్ అందిస్తాయి. ముఖ్యంగా నీటి శాతం అధికంగా ఉండే ఆహారాలు పోషకాలు పుష్కలంగా ఉండేటివి ఆహారంలో చేర్చుకోవాలి. హైడ్రేషన్ అందించే కూరగాయలు కూడా మన డైట్ లో చేర్చుకోవడం వల్ల మండే ఎండలో కూడా మనకు రోజంతా తగిన శక్తి అందుతుంది. ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుందాం.
ఆరెంజ్..
ఆరెంజ్ లో మీకు రోజంతటికి తగిన నీరు ఉంటుంది. అంతేకాదు ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఆరెంజ్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. మన శరీరానికి కావాల్సిన పోషకాలు కలిగి ఉంటుంది. ప్రతిరోజు ఒక కప్పు ఆరెంజ్ తింటే మనం శరీరానికి కావాల్సిన పొటాషియం, విటమిన్ సి అందుతుంది. ఇది రోజు అంతటికి కావాల్సిన హైడ్రేషన్ అందిస్తుంది. ఫ్రీ రాడికల్ సమస్య రాకుండా ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. అందుకే మీరు కూడా ఎండాకాలం ఆరంజ్ ను మీ డైట్ లో చేర్చుకోండి.
కీర దోసకాయ..
కీర దోసకాయలో కూడా నీటి శాతం అధికంగా ఉండే కూరగాయ ఇది మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల మీ శరీరానికి కావలసిన శక్తితో పాటు హైడ్రేషన్ కూడా అందుతుంది. ముఖ్యంగా క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇది మన శరీరంలో కావాల్సిన పోషకాలు ఉంటాయి ఎండలకు కీరదోస కాయలు ప్రతిరోజు చేర్చుకోండి.
ఇదీ చదవండి: దీర్ఘకాలిక మలబద్దక సమస్యకు ఇది సింపుల్ చిట్కా.. మీరూ తెలుసుకోండి..
యోగార్ట్..
ప్లేన్ యోగర్ట్ తీసుకోవడం వల్ల కూడా మన శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది, హైడ్రేషన్ అందుతుంది ఇందులో 90 శాతం వరకు నీరు ఉంటుంది. అంతేకాదు ఇందులో విటమిన్స్, మినరల్స్, ఫైబర్స్ ఇతర పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కలగలిపి తీసుకోవడం వల్ల మన శరీర పని తిరుగు కూడా మెరుగుపడుతుంది. ఎండకాలం మన శరీరానికి కావలసిన నీటి శాతం కూడా అందుతుంది.
పుచ్చకాయ..
పుచ్చకాయ ఎండకాలం మార్కెట్లో విరివిగా లభిస్తుంది. ఇందులో 90 శాతానికి పైగా నీరు ఉంటుంది పుచ్చకాయలో క్యాలరీలు కూడా తక్కువ మోతాదులో ఉంటాయి మీరు దీనికి కావాల్సిన పోషకాలు అందుతాయి కాబట్టి పుచ్చకాయను మీ డైట్ లో చేర్చుకోండి.
ఇదీ చదవండి: లిచ్చిపండ్ల జ్యూస్ తో బరువు సులభంగా తగ్గిపోతారు.. అదనంగా 6 ప్రయోజనాలు పొందుతారు..
పీచ్ పండు..
పీచ్ పండులో ఎక్కువ శాతం పోషకాలు ఉంటాయి. మనకు రోజంతటికి కావాల్సిన హైడ్రేషన్ అందిస్తాయి. పొటాషియం, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి తో పాటు 90% పైగా నీరు పీచు పండులో ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉండటం వల్ల మనం సీజనల్ వ్యాధుల నుంచి దూరంగా ఉండొచ్చు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి