Cause Of Cancer: ఈ విటమిన్ల లోపం వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది!
Vitamin Deficiency Cause Cancer: మన శరీరానికి విటమిన్, మినరల్స్ ఇతర పోషకాలు చాలా అవసరం. ఈ పోషకాల వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము. శరీరానికి కావాల్సిన విటమిన్‌లు అందకపోతే అనారోగ్యసమస్యల బారిన పడాల్సి ఉంటుంది. అయితే కొన్ని విటమిన్‌లు తీసుకోకపోవడం వల్ల ప్రమాదకరమైన క్యాన్సర్ సమస్య బారిన పడాల్సి ఉంటుంది.
Vitamin Deficiency Cause Cancer: ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తీసుకోవడం చాలా అవసరమని తరుచు వైద్యులు చెబుతుంటారు. మనం తీసుకొనే ఆహారం శరీరంపై ప్రభావం చూపుతుంది. ఇందులో లభించే విటమిన్, మినరల్స్ ఇతర పోషకాలు శరీరానికి ఎంతో ఉపయోగపడుతాయి. విటమిన్ లోపిస్తే తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుంది. దీని వల్ల క్యాన్సర్ బారిన పడాల్సి ఉంటుంది. ఎలాంటి విటమిన్‌లు మన శరీరానికి లోపిస్తే క్యాన్సర్ బారిన పడుతాము అనేది తెలుసుకుందాం..
విటమిన్ డి:
శరీరంలో విటమిన్ డి ఎంతో అవసరం. విటమిన్ డి ఎముకలు, దంతాలకు చాలా అవసరమని ఆరోగ్యనిపుణులు చెబుతారు. విటమిన్ డి శరీరం రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతో సహాయపడుతుంది. అంతేకాకుండా చర్మం సంరక్షణలో కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి విటమిన్ డి శరీరానికి చాలా అవసరం. ఒకవేళ మీ శరీరంలో విటమిన్ డి లోపం ఉంటే క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. విటమిన్ డి పాలు, పెరుగు, వెన్న, చీజ్, గుడ్లు ఇతర పదార్థాలలో అధికంగా లభిస్తుంది. దీని మీ ఆహారంలో భాగంగా తీసుకోవడం చాలా మంచిది.
విటమిన్ సి:
విటమిన్ సి శరీరానికి అత్యంత ముఖ్యమైన పదార్థం. దీని వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా విటమిన్ సి యాంటీఆక్సిడెంట్‌గా కూడా పని చేస్తుంది. ఇది కొన్ని క్యాన్సర్‌ల ప్రమాదాన్ని నిరోధించడంలో ఎంతో సహాయపడుతుంది. విటమిన్ సి నిమ్మకాయలు, గూస్బెర్రీస్, కివి, బొప్పాయి, స్ట్రాబెర్రీలు, జామ, బచ్చలికూరలో పుష్కలంగా ఉంటుంది.
విటమిన్ ఇ:
విటమిన్ ఇ కొన్ని క్యాన్సర్‌ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. దీని తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. విటమిన్ ఇ ఎక్కువగా గింజలు, విత్తనాలలో లభిస్తుంది. కాబట్టి దీని మీ డైట్‌లో తీసుకోవడం చాలా అవసరం.
విటమిన్ ఎ:
విటమిన్ ఎ రోగనిరోధక శక్తి, కంటి ఆరోగ్యం, చర్మ ఆరోగ్యాన్ని పెంచడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇది యాంటీఆక్సిడెంట్‌గా కూడా పనిచేస్తుంది. అంతేకాకుండా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. విటమిన్ ఎ బత్తాయి, క్యారెట్, పాలకూర ఇతర అహార పదార్థాలలో ఎక్కువగా లభిస్తుంది.
ఫోలేట్:
ఫోలేట్ అనేది ఆకు కూరలు, పప్పులు వంటి పదార్థాలలో ఎక్కువగా దొరకుతుంది. దీని తీసుకోవడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. వీటిని ప్రతిరోజు మీ డైట్‌లో తీసుకోవడం చాలా అవసరం.
Also Read Water Apple: వాటర్ యాపిల్స్ బెనిఫిట్స్ వేరు.. ప్రతిరోజు తిన్నారంటే దీర్ఘకాలిక వ్యాధులు సైతం దూరమవ్వాల్సిందే..
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్:
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలో కీలక ప్రాత పోషిస్తుంది. ఇవి తీసుకోవడం వల్ల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
సాల్మన్ ఫిష్, వాల్ నట్స్, ఫ్లాక్స్ సీడ్స్, వంటి ఆహార పదార్థాలలో దొరుకుతాయి.
Also Read Protein Powder: ఆరోగ్యకరమైన ప్రోటీన్ పౌడర్‌ను తయారు చేసుకోండి ఇలా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter