Belly Fat Reduction Tips: జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్ల నుంచి అల్లం డికాషన్ ఎంత తొందరగా ఉపశమనం కలిగిస్తుందో అందరికీ తెలిసిందే. అయితే ఈ టీ ఇన్ఫెక్షన్లనే కాకుండా ఉబకాయం వంటి సమస్యలను కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఔషధ గుణాలు శరీరంలోని కొలెస్ట్రాల్ను నియంత్రించేందుకు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. కాబట్టి ఈ డికాషన్ ని ప్రతిరోజు రెండు కప్పులు తాగడం వల్ల సులభంగా ఊబకాయం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అందుకే అల్లం తాగడం వల్ల బరువు తగ్గుతారనే సందేహం కలగవచ్చు. ఇలాంటి వారి కోసం ఆరోగ్య నిపుణులు సూచించిన వివరాలు మీకు ఈ రోజు మేము తెలుపబోతున్నాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అల్లం నీరు తయారీ పద్ధతి:
అల్లం డికాషన్:

డికాషన్ తయారు చేయడానికి ముందుగా ఒక పాత్రలో నీటిని వేడి చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని వేసి 25 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించిన తర్వాత రెండు టీ స్పూన్ల తేనెను వేసి మరో రెండు నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత ఈ నీటిని ఫిల్టర్ చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే మంచి ఫలితాలు పొందుతారు. ఈ డికాషన్ ని ప్రతిరోజు రెండు పూటల తాగడం వల్ల సులభంగా శరీర బరువును నియంత్రించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా


ఈ డికాషన్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
ఈ డికాషన్ ప్రతిరోజు తాగడం వల్ల శరీరం లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ సులభంగా కరుగుతుంది అంతేకాకుండా మధుమేహంతో బాధపడుతున్న వారి కూడా రక్తంలోని చక్కర పరిమాణాలను నియంత్రిస్తుంది. కార్టిసాల్ ఉత్పత్తిని తగ్గించి..ఒత్తిడి సమస్యలను కూడా తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.


అల్లం, గ్రీన్ టీ:
గ్రీన్ టీలో మరిగించుకున్న అల్లం నీటిని మిక్స్ చేసుకొని తాగడం వల్ల కూడా మంచి ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ టీ లో ఉండే గుణాలు పొట్ట సమస్యలను తగ్గించడమే కాకుండా పొట్ట చుట్టూ పేరుకుపోయిన బెల్లీ ఫ్యాట్ ను నియంత్రించేందుకు కీలక పాత్ర పోషిస్తుందని వారు అంటున్నారు. ముఖ్యంగా ఊబకాయం సమస్యలతో బాధపడుతున్న వారు రోజుకు రెండు పూటల ఈ మిక్స్ చేసుకున్న డికాషన్ ని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 


Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook