Diet For Weight Gain in 7 Days: శరీర బరువు తగ్గించుకోవడం ఎంత కష్టమో.. శరీర బరువుని పెంచడం కూడా అంతే కష్టం. ప్రస్తుతం చాలామంది శరీర బరువును పెంచుకోవడానికి మార్కెట్లో లభించే రసాయనాలతో కూడిన పౌడర్లను వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించడం వల్ల భవిష్యత్తులో తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బరువు పెరగాలనుకునేవారు ప్రతిరోజు తీసుకునే ఆహారంలో పాలతో కూడిన పదార్థాలను వినియోగిస్తే మంచి ఫలితాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే మంచి కొలెస్ట్రాల్ బరువును పెంచడమే కాకుండా శరీర కండరాలను దృఢంగా చేసేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా పాల పదార్థాలలో ఉండే గుణాలు పొట్ట సమస్యలైనా మలబద్ధకం, పొట్టలో వాపు సమస్యలను తగ్గించేందుకు ప్రధాన పాత్ర పోషిస్తాయి.


అంతేకాకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన పన్నీర్ తో తయారుచేసిన పాప్ కార్న్ తీసుకోవడం వల్ల కూడా తులబంగా బరువు పెరుగుతారని వారు చెబుతున్నారు. అయితే ఈ పాప్ కార్న్ ఎలా తయారు చేసుకోవాలో? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో? మనం ఇప్పుడు తెలుసుకుందాం..


పన్నీర్  పాప్ కార్న్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:
✵ అరకప్పు పన్నీర్ ముక్కలు
✵ రెండు టీ స్పూన్ల గరం మసాలా
✵ ఒక టీ స్పూన్ కారం
✵ ఒక టీ స్పూన్ ధనియాల పొడి
Also Read: IPL 2023 Winner: ఐపీఎల్ 2023 ఫైనల్ జీటీ వర్సెస్ సీఎస్కే చివరి ఓవర్‌లో ఏం జరిగింది, చెన్నై ఎలా గెలిచింది


✵ పావు టీ స్పూన్ మిరియాల పొడి
✵ నాలుగు టేబుల్ స్పూన్ల మైదాపిండి
✵ ఐదు టేబుల్ స్పూన్ల చిక్కటి పాలు
✵ ఐదు టేబుల్ స్పూన్ల బ్రెడ్ పౌడర్
✵ తగినంత ఉప్పు, నూనె


పన్నీర్ పాప్ కార్న్ తయారీ విధానం:
✵ ముందుగా ఒక బౌల్ తీసుకొని.. అందులో పన్నీర్ ముక్కలు, మిర్యాల పొడి, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
✵ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
✵ మరో బౌల్లో బ్రెడ్ పౌడర్ వేసుకోవాలి.
✵ అందులో అందులోనే చిక్కటి పాలు, మైదా పిండిని కలుపుకొని మిశ్రమంలో తయారు చేసుకోవాలి.
✵ ఇలా తయారు చేసుకున్న తర్వాత పన్నీర్ ముక్కలను ఆ మిశ్రమంలో వేయాలి.
✵ వేసిన తర్వాత నూనెను వేడి చేసి ఒక్కొక్క పన్నీరు మొక్కను నూనెలో వేస్తూ మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. 
✵ ఇలా వేయించుకున్న తర్వాత పన్నీర్ ముక్కలను ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి..


Also Read: IPL 2023 Winner: ఐపీఎల్ 2023 ఫైనల్ జీటీ వర్సెస్ సీఎస్కే చివరి ఓవర్‌లో ఏం జరిగింది, చెన్నై ఎలా గెలిచింది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి