Cardiac attack: కాళ్లల్లో ఈ లక్షణాలు గుర్తించారా.. తస్మాత్ జాగ్రత్త..!
Heart Health: కాళ్లలో భారం, నొప్పి.. కొద్ది దూరం నడవగానే లేదా మెట్లు ఎక్కిన తర్వాత కాళ్లలో విపరీతమైన నొప్పి చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇలా అనిపిస్తే మీరు వెంటనే డాక్టర్స్ ని కన్సల్ట్ అవ్వడం ఉత్తమం. ఎందుకంటే ఇవి గుండె సంబంధిత వ్యాధులకు చిహ్నాలు అని తెలుపుతున్నాయి వైద్య అధ్యయనాలు.
Heart attack: ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మందికి అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. పుట్టిన పిల్లల్లో కూడా ఈ మధ్య రకరకాల సమస్యలు ఆ చిన్నపిల్లలను మరింత ఇబ్బంది పెడుతున్న విషయం తెలిసిందే. అందుకే జాగ్రత్తగా ఉండాలని, అనారోగ్య సమస్యలు రాకుండా పలు నియమాలు పాటించాలని వైద్యులు సైతం చెబుతూ ఉంటారు.
ఇకపోతే హార్ట్ ఎటాక్ అనేది ఈ మధ్యకాలంలో మరింత ఎక్కువగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఉన్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, అధిక ఒత్తిడి కారణంగా 20 సంవత్సరాలు కూడా నిండకనే చాలామంది హార్ట్ ఎటాక్ కి గురవుతున్నారు.
అయితే ఇప్పుడు ఈ హార్ట్ ఎటాక్ అనేది మన కాళ్ల ద్వారా కూడా తెలుసుకోవచ్చట. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. మనం అనుసరించే జీవనశైలి,ఫాస్ట్ ఫుడ్, నూనె పదార్థాలు లాంటివి అత్యంత అనారోగ్యకరమైన ఆహారం అధిక ఒత్తిడి కూడా పలు రకాల అనారోగ్యాలకు దారితీస్తుంది.
ముఖ్యంగా గుండె పోటు రావడానికి కాళ్లలో కనిపించే సంకేతాలు కూడా ప్రధానం అని నిపుణులు చెబుతున్నారు.
లక్షణాలు ఇవే..
ముఖ్యంగా కాళ్లలో భారం, నొప్పి.. కొద్ది దూరం నడవగానే లేదా మెట్లు ఎక్కిన తర్వాత కాళ్లలో విపరీతమైన నొప్పి కనిపిస్తుంది. ఇది గుండెపోటుకు కూడా కారణం కావచ్చు. అలాగే కాళ్లు చీలమండలు లేదా పిరుదులు ఆకస్మికంగా ఉబ్బడం కూడా గుండెపోటుకు సంకేతం. గుండె బలహీనంగా ఉన్నప్పుడు శరీర భాగాలకు రక్తం సరిగ్గా పంపు చేయలేక పోతుంది. అలాంటప్పుడు అకస్మాత్తుగా పాదాలు వాపు కు గురవుతాయి. అలాగే కాళ్లల్లో జలదరింపు, తిమ్మిరి, రక్త ప్రవాహం తగ్గినప్పుడు కనిపిస్తాయి. గుండెపోటుకు ఇది కూడా ఒక సంకేతం కావచ్చు. అందుకే కాళ్లల్లో కనిపించే ఈ లక్షణాలపై మీరు వెంటనే అప్రమత్తం అవ్వాలని వైద్యులు సైతం సూచిస్తున్నారు.
ఇక గుండెపోటు రావడానికి గుండెలో నొప్పి, ఒత్తిడి , శ్వాస ఆడక పోవడం , ఆందోళన , వాంతులు, అలసట, నీరసం, అధిక చమట లాంటి లక్షణాలు కూడా గుండెపోటుకు సంకేతాలు కావచ్చు. కాబట్టి రెగ్యులర్గా వ్యాయామం చేయడం ,ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవడం, ఒత్తిడిని దూరం చేయడం లాంటివి గుండెపోటు సమస్య నుంచి మిమ్మల్ని తప్పిస్తాయి.
Also Read: Shamshabad Airport: ఎంతైనా డబ్బులిస్తామయ్యా ఫ్లైట్ ఎక్కించు.. శంషాబాద్‌లో ప్రయాణికుల గొడవ
Also Read: Windows Outage: ఒక్క సమస్యతో ప్రపంచం అతలాకుతలం.. స్తంభించిన ఎయిర్‌లైన్స్, బ్యాంకింగ్, టెలికాం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter