Immunotherapy: కేన్సర్ చికిత్సకు అద్భుతంగా పనిచేస్తున్న ఇమ్యునోథెరపీ, ఎలా పనిచేస్తుందంటే
Immunotherapy: ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినా కొన్ని ప్రాణాంతక వ్యాధులకు ఇప్పటికీ సరైన చికిత్స లేదు. అందులో అత్యంత ప్రమాదకరమైంది కేన్సర్. కేన్సర్ వ్యాధికి ఇప్పటికే సరైన చికిత్స లేకపోవడంతో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Immunotherapy: కేన్సర్ విషయంలో ఇప్పుడు కాస్త ఆశాజనకమైన వార్తలు వెలువడుతున్నాయి. ప్రాణాంతకమైన కేన్సర్ వ్యాధి చికిత్సలో ఇమ్యునోధెరపీ చికిత్స మంచి ఫలితాలనిస్తోందని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా స్టేజ్ 4 లో ఉన్న కేన్సర్ రోగులు సైతం ఈ చికిత్సతో కోలుకుంటున్నారు. అసలు ఈ ఇమ్యునోధెరపీ చికిత్స అంటే ఏమిటో తెలుసుకుందాం.
కేన్సర్ అనేది ఓ ప్రాణాంతక వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో రెండవ అత్యధిక మరణాలు కేన్సర్ కారణంగానే సంభవిస్తున్నాయి. ఎంత ప్రమాదకరమైందంటే కేన్సర్ పేరు చెప్పగానే మరణమే కన్పిస్తుంది. కేన్సర్ లక్షణాల్ని బట్టి వ్యాధిని పలు దశలుగా వర్గీకరించారు. కేన్సర్ ప్రభావాన్ని తగ్గించేందుకు లేదా తొలగించేందుకు కిమియోథెరపీ, రేడియోథెరపీ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఇక మరో చికిత్సా విధానం ఇమ్యునోథెరపీ. కేన్సర్ వ్యాధిగ్రస్థులకు ఇదొక వరంలా కన్పిస్తోంది.
ఇమ్యునోథెరపీ అంటే ఏమిటి
ఇమ్యునోథెరపీ అనేది ఓ రకమైన కేన్సర్ చికిత్సా విధానం. ఇందులో ఇమ్యూనిటీని పెంచడం, శరీరంలోని కేన్సర్ కణాల్ని వెతికి వాటిని నాశనం చేసేందుకు ప్రయోగశాలలో తయారు చేసిన పదార్ధాల్ని ఉపయోగిస్తారు. ఇమ్యునోథెరపీ వాస్తవానికి చాలా రకాలుగా ఉంటుంది. కొన్ని విధానాల్లో కేన్సర్ కణాల అభివృద్ధిని నిలువరించేందుకు లేదా తగ్గించేందుకు లేదా కేన్సర్ శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించకుండా ఆపడం చేస్తుంటారు. రోగి పరిస్థితిని బట్టి కీమోథెరపీతో కలిపి లేదా మరో విధంగా ఈ చికిత్సను అందిస్తుంటారు.
ఏ స్టేజ్ రోగులకు ఇది ఉపయోగకరం
ఇమ్యునోథెరపీ అనేది కేన్సర్‌లోని చాలా దశల్లో ఉపయోగకరం. కానీ కిడ్నీ, కడుపు, లంగ్స్, బ్రెస్ట్ కేన్సర్ వంటి 4 కేన్సర్ రకాల్లో ఈ చికిత్సా విధానం ప్రయోజనం చేకూరుస్తుంది. ఇమ్యునోథెరపీ అనేది ఎంపిక చేసిన కేన్సర్ రోగులకు అత్యంత ప్రయోజనకరమైందిగా మారింది. అయితే అందరు రోగులకు ఇమ్యునోథెరపీ అందరికీ సరిగ్గా పనిచేయదు. 25-30 శాతం రోగులకు ఈ చికిత్స ద్వారా మంచి ఫలితాలు లభిస్తాయి. ఇమ్యునోథెరపీ కేన్సర్ రోగులకు చాలా బాగా పనిచేస్తుంది కానీ ఖర్చు అదికం కావడంతో చాలామంది వెనుకంజ వేస్తుంటారు. ఇమ్యునోథెరపీ ఖర్చు సెషన్‌కు 1 లక్ష 50 వేల నుంచి 4 లక్షల 50 వేలవరకూ ఉంటుంది. రోగి పరిస్థితిని బట్టి మారుతుంటుంది.
Also read: iBomma Movies: సినీ ప్రియులకు గుడ్‌న్యూస్, ఐ బొమ్మలో కొత్త సినిమాల సందడి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook