Insulin Plant For Diabetes: మారుతున్న జీవనశైలిని ప్రస్తుతం చాలామంది యువత అనుసరిస్తున్నారు. దీని కారణంగా వారు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా వీరిలో డయాబెటిస్ బారిన పడేవారి సంఖ్య ఎక్కువని నిపుణులు పలు నివేదికల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా చాలామంది రక్తంలో చక్కెర పరిమాణాలను నియంత్రించుకోకుండా ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మధుమేహంతో బాధపడేవారు వారు వారు తీసుకునే ఆహారంపై అనుసరించే జీవన శైలిపై తప్పకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందాల్సి ఉంటుంది. అయితే దీనికోసం తప్పకుండా ఈ కింద పేర్కొన్న పలు ఔషధ గుణాలు కలిగిన వస్తువులను క్రమం తప్పకుండా వినియోగించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఆకులను క్రమం తప్పకుండా తింటే రక్తంలో గ్లూకోస్ స్థాయిలు చక్కర పరిమాణాలు సులభంగా నియంత్రణలోకి వస్తాయి:


ఇన్సులిన్ ప్లాంట్:
ఇన్సులిన్ మొక్క శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతుంది. ఇందులో ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఆస్కార్బిక్ యాసిడ్, బీటా కెరోటిన్, ఐరన్, కరోసోలిక్, టెర్పెనాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ అధిక పరిమాణంలో లభిస్తాయి కాబట్టి ఈ మొక్క ఆకులను క్రమం తప్పకుండా ఆహారంలో వినియోగిస్తే సులభంగా రక్తంలోని గ్లూకోస్ స్థాయిలను నియంత్రించవచ్చని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా దీనిని క్రమం తప్పకుండా తినడం వల్ల అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.


మెంతి ఆకులు:
మధుమేహంతో బాధపడుతున్న వారికి మెంతి ఆకులు కూడా ప్రభావంతంగా సహాయపడతాయి. వీటితో తయారుచేసిన ఆహార పదార్థాలను ప్రతిరోజు తినడం వల్ల రక్తంలోని చక్కర పరిమాణాలు సులభంగా తగ్గుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలపై ప్రభావం చూపి శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది.


అలోవెరా:
అలోవెరా జెల్ చర్మ సౌందర్యానికి వినియోగించడమే కాకుండా చాలా రకాలుగా వినియోగించవచ్చని ఆరోగ్యం నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అలోవెరాను జ్యూస్ లా తయారు చేసుకుని తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి అంతేకాకుండా రక్తంలోని చక్కర పరిమాణాలు కూడా సులభంగా తగ్గుతాయి.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: Waltair Veerayya OTT Release: అప్పుడే OTTలో వాల్తేరు వీరయ్య రిలీజ్... ఎందులో అంటే?


Also Read: Balakrishna Fans Arrested: వీర సింహా రెడ్డి థియేటర్ వద్ద అత్యుత్సాహం..10 మంది బాలయ్య ఫాన్స్ అరెస్ట్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook