Iron Deficiency: ఐరన్ అనేది శరీరానికి చాలా అత్యవసరమైన మినరల్. చాలా రకాల వ్యాధుల్నించి రక్షణ కల్పించడంలో ఐరన్ అత్యంత కీలకంగా ఉపయోగపడుతుంది. ఐరన్ లోపముంటే శరీరంలో విపరీతమైన బలహీనత ఉంటుంది. హిమోగ్లోబిన్ కొరత ఏర్పడుతుంది. ఇంకా ఇతర వ్యాధులకు దారితీస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐరన్ లోపం సరిచేసేందుకు డైట్‌లో మార్పులు చేసుకోవల్సి వస్తుంది. రోజువారీ డైట్‌లో నిమ్మ, పాలకూర, బీట్‌రూట్, పిస్తా, ఎండు ద్రాక్ష, జాంకాయ, అరటి పండ్లు, అంజీర్ వంటి వస్తువుల్ని డైట్‌లో చేర్చాల్సి ఉంటుంది. చాలామంది ఐరన్ లోపమనగానే ఎనీమియా ఒక్కటే అనుకుంటారు. కానీ ఇంకా చాలా వ్యాధులకు కారణమౌతుంది. ఐరన్ లోపముంటే గుండె వ్యాధులు కూడా తలెత్తవచ్చు. అందుకే ఐరన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.


హెయిర్ అండ్ స్కిన్ డిసీజ్


ఐరన్ అనేది అందాన్ని పెంచడంలో కూడా దోహదపడుతుంది. ఐరన్ లోపముంటే చర్మం, కేశాల సంబంధిత సమస్యలు ప్రారంభమౌతాయి. చర్మంలో డ్రైనెస్, మచ్చలు-మరకలు, చర్మం రంగు తగ్గిపోవడం, చర్మం నిర్జీవంగా మారడం, కేశాలు రాలడం, డేండ్రఫ్ సమస్యలు ఎదురౌతుంటాయి.


ఎనీమియా


ఐరన్ లోపముంటే ప్రధానంగా ఎదురయ్యే సమస్య ఇది. అంటే హిమోగ్లోబిన్ లోపించడం. ప్రత్యేకించి మహిళల్లో ఈ సమస్య అధికంగా ఉంటుంది. అందుకే రోజూ ఐరన్ సమృద్ధిగా లభించే పదార్ధాలు తప్పకుండా తీసుకోవాలి. 


బలహీనత-అలసట


శరీరంలో ఐరన్ లోపిస్తే ఎదురయ్యే మరో ప్రధాన సమస్య హిమోగ్లోబిన్. హిమోగ్లోబిన్ లోపముంటే నిద్ర కూడా సరిగ్గా పడదు. అంతేకాకుండా రోజంతా తీవ్రమైన అలసట ఉంటుంది. చిన్న పని చేసినా అలసిపోతుంటారు. రోజువారీ జీవితంలో సాదారణ పనులు కూడా చేయలేని పరిస్థితి ఉంటుంది. 


గుండె వ్యాదులు


గుండె ఆరోగ్యంపై ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. దేశంలో గుండె వ్యాధుల కేసులు పెరిగిపోతున్నాయి. శరీరంలో ఐరన్ లోపం ఉంటే హిమోగ్లోబిన్ సమస్య తలెత్తుతుంది. శరీరంలోని అన్ని అవయవాలకు ఆక్సిజన్ సరఫరాలో సమస్యగా మారుతుంది. దాంతో గుండె వ్యాధుల ముప్పు పెరుగుతుంది. 


Also read: SIP Investment Tips: మ్యూచ్యువల్ ఫండ్ SIPతో కోటి రూపాయలు సంపాదించవచ్చు, ఎలాగంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook