Omicron Variant: ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షల్లో ఒమిక్రాన్ వేరియంట్ గురించి తెలుస్తుందా లేదా
Omicron Variant: దేశమంతా కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. రోజురోజుకూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. అటు ఒమిక్రాన్ కేసుల ఆందోళన అధికమౌతోంది. ఈ క్రమంలో ఒమిక్రాన్ వేరియంట్ గుర్తించేందుకు ఆర్టీపీసీఆర్ పరీక్ష లేదా ర్యాపిడ్ యాంటీజెన్ ఎంతవరకూ ఉపయోగపడతాయో తెలుసుకుందాం.
Omicron Variant: దేశమంతా కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. రోజురోజుకూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. అటు ఒమిక్రాన్ కేసుల ఆందోళన అధికమౌతోంది. ఈ క్రమంలో ఒమిక్రాన్ వేరియంట్ గుర్తించేందుకు ఆర్టీపీసీఆర్ పరీక్ష లేదా ర్యాపిడ్ యాంటీజెన్ ఎంతవరకూ ఉపయోగపడతాయో తెలుసుకుందాం.
దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు కరోనా థర్డ్‌వేవ్ ( Corona Third Wave)ఇప్పటికే ప్రారంభమైపోయింది. ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సినేషన్, కోవిడ్ లక్షణాలు, టెస్ట్ రిపోర్ట్‌ల గురించి ఎదురు చూస్తున్న పరిస్థితి. వ్యాక్సినేషన్ తీసుకున్నవారు కూడా ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడటానికి కారణాలేంటనేది ఆసక్తిగా మారింది. దేశంలో గత 24 గంటల్లో లక్షా 60 వేల కేసులు నమోదవడం ఆందోళన కల్గిస్తోంది. ఈ క్రమంలో ఆర్టీపీసీఆర్ లేదా యాంటీజెన్ పరీక్షతో ఒమిక్రాన్ వేరియంట్ సోకిందా లేదా అనేది తెలుస్తుందా. ఇదే ఇప్పుడు ఆసక్తిగా మారింది.
ఆర్టీపీసీఆర్ పరీక్షలో ఎస్ జీన్ (S gene Dropout) ఒకవేళ భారీగా పడిపోయుంటే..ఒమిక్రాన్ అయుండవచ్చని డాక్టర్ లాన్స్‌లెట్ పింటో అంటున్నారు. అదే సమయంలో ఎస్ జీన్ ఉన్నంత మాత్రాన ఒమిక్రాన్ కాదని కూడా చెప్పలేమన్నారు. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఒమిక్రాన్ వేరియంట్ (Omicron Variant) గుర్తించేందుకు వీలుగా డ్యూయల్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ అవలంభించమని రాష్ట్రాల్ని కోరింది. ఇందులో భాగంగా కోవిడ్ టెస్ట్‌లో పాజిటివ్ ఉండి. ఎస్ జీన్ డ్రాపవుట్ ఉంటే ఒమిక్రాన్ సీక్వెన్సింగ్‌కు పంపాల్సి ఉంటుంది.
అయితే పీసీఆర్, యాంటీజెన్ ర్యాపిడ్ టెస్ట్ ద్వారా కోవిడ్ వైరస్‌తో పాటు ఒమిక్రాన్ వేరియంట్ ఉందా లేదా అనేది గుర్తించవచ్చని యూనిసెఫ్ (Unicef) చెబుతోంది. అదే సమయంలో కోవిడ్ వ్యాక్సిన్ వల్ల రక్షణ మాత్రం ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు చెబుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్నవారిలో లక్షణాలు స్వల్పంగా ఉండవచ్చంటున్నారు. ఒకవేళ ఎవరికైనా ఒమిక్రాన్ వేరియంట్ సోకితే..దేశంలో అందుబాటులో ఉన్న ఆంటీ వైరల్ లేదా యాంటీబాడీ కాక్టెయిల్ మందులు పనిచేయడం లేదని అర్ధం చేసుకోవాలని డాక్టర్ పింటో అంటున్నారు.
Also read : Coffew and Tea: కాఫీ, టీలలో ఏది మంచిది..ఏది కాదు, రోజుకు ఎన్ని కప్పులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook