Isabgol For Weight Loss: ఈసబ్ గోల్ ఊకతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..!
Isabgol For Weight Loss: ప్రస్తుతం చాలా మంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడడం ఎవరికైనా అంత సులువు కాదు. ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి జిమ్ చేయడం, ఆరోగ్యకరమైన ఫుడ్‌ను తీసుకోవడం వంటివి చేస్తూ ఉంటారు.
Isabgol For Weight Loss: ప్రస్తుతం చాలా మంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడడం ఎవరికైనా అంత సులువు కాదు. ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి జిమ్ చేయడం, ఆరోగ్యకరమైన ఫుడ్‌ను తీసుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. కానీ ఊబకాయం వంటి సమస్యల నుంచి విముక్తి పొందలేకపోతున్నారు. కరోనా మహమ్మారి తర్వాత చాలా మంది వేగంగా బరువు పెరిగాయని నివేదికలు పేర్కొన్నాయి. కానీ ఇప్పుడు బరువు తగ్గడం వారికి చాలా కష్టం. ఎలాంటి ఆహారం తీసుకుంటే బరువు తగ్గుతారో తెలుసుకుందాం..
బరువు తగ్గడానికి ఈసబ్ గోల్ వినియోగించండి:
పెరుగుతున్న బరువును తగ్గించుకోవాలనుకుంటే..రోజు తీసుకునే ఆహారంలో ఈసబ్ గోల్ వినియోగిస్తే బరువు పెరగడం వంటి సమస్యలు తగ్గుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.
ఈసబ్ గోల్ బరువును ఎలా తగ్గిస్తుంది?:
ఈసబ్ గోల్‌లో క్యాలరీలు చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. అయితే వీటిని తింటే ఎక్కువసేపు ఆకలి అనిపించదని ఆయుర్వేద శాస్త్రంలో పేర్కొంది. వీటిని రోజూ ఉదయం అల్పాహారంగా తింటే, బరువు వేగంగా తగ్గి, బొడ్డు చుట్టు కొవ్వు కూడా తగ్గుతుందని శాస్త్రం తెలుపుతుంది.
మలబద్ధకం సమస్యలు కూడా దూరమవుతాయి:
ఈసబ్ గోల్‌లో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇది అసిడిటీ, మలబద్ధకం సమస్యలను దూరం చేస్తుంది. పొట్టకు సంబంధించిన అవాంతరాలను కూడా చిటికెలో మాయం చేస్తుంది.
ఈసబ్ గోల్ ఎలా ఉపయోగించాలి?:
ఈసబ్ గోల్‌ను నీరు లేదా పండ్లరసంతో కలిపి తాగవచ్చు. కొంతమంది దీని సిరప్ తయారు చేసి కూడా తాగుతారు. దీని కోసం..2 టీస్పూన్ల ఈసబ్ గోల్ నీటిలో కలిపి, దానిని ఉదయం పూట ఖాళీ కడుపుతో తాగండి.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Astro Tips: ఇలా చేస్తే తరగని సంపద మీ సొంతం.. ఇంట్లో ధనం నిలిచి ఉంటుంది...
Also Read: Chanakya Niti: లక్ష్మీ దేవి మీ ఇంట్లో ఉండాలంటే ఈ పద్దతులు పాటించండి!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook