Itching In The Sole: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ముఖ్యంగా బయట లభించే అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్లే ఇలాంటి సమస్యలకు గురవుతున్నారని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం చాలా మందిలో అరికాళ్ళలో దురద రావడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ సమస్య కారణంగా చాలా మంది రోజూ ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ దురద నుంచి ఉపశమనం పొందడానికి పలు రకాల అంశాలను పాటించాని నిపుణులు తెలుపుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అరికాళ్ళలో దురద ఎందుకు వస్తుంది?


అరికాళ్లలో దురదలు రావడానికి చాలా కారణాలు ఉండవచ్చు. పాదాలలో రక్త ప్రసరణ పెరగడం, శరీరంలో నీటి కొరత, అలెర్జీలు, మధుమేహం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తాయని నిపుణులు తెలుపుతున్నారు. చాలాసార్లు బూట్లు లేదా సాక్స్‌లను పదే పదే వినియోగించడం వల్ల పాదాలలో చెమటలు వచ్చి దురదకు కారణమవుతుంది.


ఈ దురదను వదిలించుకోవడానికి ఇంటి నివారణలు:


1. ఆపిల్ సైడర్ వెనిగర్:


పాదాలలో తీవ్రమైన దురద ఉన్నప్పుడు.. ఖచ్చితంగా ఆపిల్ సైడర్ వెనిగర్ తాగండి. దానిలో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఈ సమస్యలపై చాలా ప్రభావవంతంగా పని చేస్తాయి. ఇది ఇన్ఫెక్షన్ తగ్గించడానికి సహాయపడుతుంది.


2. ఉప్పు నీరు:


రాళ్ల ఉప్పును నీటిలో కలిపి తాగడం వల్ల అరికాళ్లలో దురద తొలగిపోతుందని నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో కూడా యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇది రక్త ప్రసరణను అదుపులో ఉంచి.. పాదాలలో మంటను తొలగిస్తుంది.


3. పెరుగు


పెరుగు తినడం ద్వారా అరికాళ్ళ దురదను కూడా మాయమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది పాదాల ఇన్ఫెక్షన్‌ను తగ్గించి.. శరీరంలోని అన్ని భాగాలకు చల్లదనం చేస్తుంది.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


 


Also Read: Weight Loss Mistakes: బరువు తగ్గే క్రమంలో ఇలా చేయకండి.. ఈ విధంగా చేస్తే సమస్యలు తప్పవు..!


Also Read: Lalu Prasad Yadav's Health Condition: లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం విషమం.. లేటెస్ట్ అప్‌డేట్స్



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook