Jaggery Ginger Tea: చలికాలం ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడేది ఆ టీనే, రోజుకు 2 కప్పులు చాలు
Jaggery Ginger Tea: చలికాలం ఎంట్రీ ఇచ్చేసింది. దేశంలో క్రమంగా ఉష్ణోగ్రత పడిపోతోంది. చలికాలంలో ఎదురయ్యే సీజనల్ ఇన్‌ఫెక్షన్లు కూడా అధికమౌతున్నాయి. మరి ఈ సమస్యల్నించి ఎలా ఉపశమనం పొందాలో తెలుసుకుందాం..
చలికాలంలో ప్రధానమైన ఇబ్బంది అనారోగ్యం. వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లు దాడి చేస్తుంటాయి. ముఖ్యంగా జలుబు, దగ్గుతో పాటు గొంతు గరగర తీవ్రమైన సమస్యగా ఉంటుంది. అయితే సులభమైన ఇష్టమైన ఓ పదార్ధంతో ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చంటున్నారు వైద్యులు.
దేశంలో అధికశాతం టీ అంటే ఇష్టపడుతుంటారు. ఇదే టీని పంచదార లేకుండా బెల్లం, అల్లంతో కలిపి తీసుకుంటే రుచి, ఉల్లాసంతో పాటు ఆరోగ్యం చేకూరుతుంది. చలికాలపు సమస్యల్నించి ఉపశమనం పొందవచ్చు. టీలో పంచదారకు బదులు బెల్లం, అల్లం కలిపి తాగితే..అద్భుతమైన దివ్యౌషధమైపోతుంది. అదే అల్లం బెల్లం టీ. ఆ ప్రయోజనాలేంటో చూద్దాం..
భారతదేశంలో అత్యధిక శాతం ప్రజలు ఇష్టంగా తాగేది టీ మాత్రమే. మంచి నీళ్ల తరువాత ఎక్కువగా తాగేది టీ అంటే అతిశయోక్తి లేదంట. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేవరకూ రోజుకు 1-4 సార్లు టీ తాగుతూనే ఉంటారు. అయితే టీ అతిగా తాగడం వల్ల అందులో ఉండే పంచదార కారణంగా..దుష్ప్రయోజనాలు హాని చేకూరుస్తాయి.
ప్రస్తుతం చలికాలం. ఈ కాలంలో గొంతు గరగర, జలుబు, దగ్గుతో పాటు ఇతర సీజనల్ ఇన్‌ఫెక్షన్లు దాడి చేస్తుంటాయి. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు అల్లం బెల్లం టీ అద్భుతమైన ఔషధం. అల్లంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాల కారణంగా గొంతు గరగర, జలుబు, దగ్గు వంటి సమస్యలు తొలగిపోతాయి. అల్లం కారణంగా గొంతు సంబంధిత ఇన్‌ఫెక్షన్లు దూరమౌతాయి. అల్లం బెల్లం టీతో ఆరోగ్యమే కాకుండా రుచి కూడా అద్భుతంగా మారిపోతుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉండటం వల్ల అధిక బరువు సమస్య కూడా తగ్గుతుంది.
టీలో అల్లం బెల్లం కలపడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అదే సమయంలో కడుపుకు సంబంధించిన సమస్యలు దూరమౌతాయి. అల్లం కడుపును క్లీన్ చేస్తుంది. బెల్లంలో ఉండే విటమిన్లు, మినరల్స్ ఆరోగ్యానికి మంచివి. ఇటీవలి కాలంలో వివిధ రకాల ఆహారపు అలవాట్ల కారణంగా రక్తహీనత అంటే ఎనీమియా తరచూ సమస్యగా మారుతోంది. అల్లం బెల్లం టీతో ఈ సమస్యను పరిష్కరించవచ్చు.
Also read: Heart Attack Reasons: చిన్న వయస్సుకే గుండెపోటు, ఈ పరిస్థితి కారణమేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook