Java Plum Benefits: నేరేడు పండ్ల వల్ల చర్మానికి ఎన్ని రకాల ప్రయోజనాలున్నాయో తెలుసా..!
Java Plum Benefits: నేరేడు పండ్లు సాధారణంగా వేసవిలో లభించే.. ఓ రుచికరమైన పండు. ఈ పండును పలు రాష్ట్రాల్లో వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. ముఖ్యంగా భారత్‌లో జామూన్, రాజ్‌మాన్, జమాలి, బ్లాక్ జామూన్, బ్లాక్‌బెర్రీ మొదలైన పేర్లతో సంబోధిస్తారు. ఇందులో ఉండే గుణాలు శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతాయి.
Java Plum Benefits: నేరేడు పండ్లు సాధారణంగా వేసవిలో లభించే.. ఓ రుచికరమైన పండు. ఈ పండును పలు రాష్ట్రాల్లో వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. ముఖ్యంగా భారత్‌లో జామూన్, రాజ్‌మాన్, జమాలి, బ్లాక్ జామూన్, బ్లాక్‌బెర్రీ మొదలైన పేర్లతో సంబోధిస్తారు. ఇందులో ఉండే గుణాలు శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతాయి. ముఖ్యంగా ఇవి పురుషుల శరీరాన్ని దృఢంగా చేసేందుకు కృషి చేస్తాయి. అంతేకాకుండా జీర్ణక్రియను మెరుగు పరిచేందుకు దోహదపడుతుంది. అయితే పురుషులు వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరానికి ఎలాంటి లాభాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
బరువు తగ్గిండానికి సహాయపడుతుంది:
పురుషుల్లో బరువు తగ్గాలనుకునే వారు వీటిని క్రమం తప్పకుండా తిసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిని తినడం వల్ల త్వరగ బరువు తగ్గే అవకాశాలున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఇందులో బరువును తగ్గించే ఫైబర్ అధిక పరిమాణంలో ఉంటుంది. దీనితో పాటు.. కొలెస్ట్రాల్ కూడా నియంత్రిస్తుంది.
రక్తపోటు అదుపులో ఉంటుంది:
రక్తపోటు సమస్యలతో బాధపడేవారికి నేరేడు పండ్లు దివ్యౌషధంగా పని చేస్తాయి. ఇందులో ఉండే పొటాషియం రక్తపోటు సమస్యను దూరం చేయడమే కాకుండా.. రక్తపోటు సమస్యలను తగ్గిస్తుంది.
చర్మాన్ని మెరుగు పరుచుతుంది:
ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యలతో బాధపడుతున్న వారు ఉపశమనం పొందడానికి నేరేడు పండ్లను తినమని వైద్యుల సూచిస్తున్నారు. వీటిని తినడం వల్ల చర్మంపై ఉన్న మొటిమలు మొదలైన సమస్యలు దూరమవుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో ఉండే విటమిన్-సి చర్మాన్ని మెరుగు పరుచడమే కాకుండా.. చర్మ సమస్యల నుంచి దూరం చేసేందుకు కృషి చేస్తుందని నిపుణులు తెలుపుతున్నారు.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: White Hair Treatment At Home: తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే ఇది మీ కోసమే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి