Joint Pains Remedies: కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? మీ ఇంటి కిచెన్లోనే 7 మెడిసిన్స్ ఉన్నాయి..
Joint Pains HomeRemedies: కీళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు కూడా చాలామంది ఉన్నారు. దీనికి ఎప్పటికప్పుడు డైట్ పాటిస్తూ కొన్ని రకాల మందులను తీసుకోవాలి. అయితే వంటింటి కిచెన్ లో కూడా కీళ్ల నొప్పులకు తగ్గించే మందులు ఉన్నాయి.
Joint Pains HomeRemedies: కీళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు కూడా చాలామంది ఉన్నారు. దీనికి ఎప్పటికప్పుడు డైట్ పాటిస్తూ కొన్ని రకాల మందులను తీసుకోవాలి. అయితే వంటింటి కిచెన్ లో కూడా కీళ్ల నొప్పులకు తగ్గించే మందులు ఉన్నాయి. ఇవి గత సంవత్సరాలుగా మన ఆయుర్వేదంలో కూడా విపరీతంగా వినియోగిస్తున్నారు అవి ఏంటో తెలుసుకుందాం.
అల్లం..
అల్లం మన వంటింటి కిచెన్లో ఎప్పుడు అందుబాటులోనే ఉంటుంది. వీటిని మనం వంటల్లో వినియోగిస్తాం. అయితే ఆయుర్వేదంలో కూడా ఏళ్లుగా దీన్ని వినియోగిస్తారు. ఇది జలుబు, మైగ్రేన్, ఆర్థరైటిస్ ని సమర్థవంతంగా తగ్గిస్తుంది. అల్లం లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి.
వెల్లుల్లి..
వెల్లుల్లి నుంచి మంచి అరోమా వస్తుంది. ఇది వంటకు మంచి రుచిని అందిస్తుంది. అల్లంతో పాటు వెల్లుల్లి కలిపి మనం వినియోగిస్తాము. దీన్ని కూడా మన సంప్రదాయ మెడిసిన్స్ లో ఎన్నో ఏళ్లుగా వినియోగిస్తున్నారు. వెల్లుల్లి జాయింట్ పెయింట్స్ ఆర్థరైటీస్ సమస్యలు కూడా సమర్థవంతమైన రెమ్మడి ఇందులో ఉండే అల్లిసిన్ యాంట్ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది.
ఇదీ చదవండి:ఎండకాలం ప్రతిరోజూ ఆరెంజ్ జ్యూస్ తాగితే మీ శరీరంలో ఏ మార్పు జరుగుతుందో తెలుసా?
పసుపు..
పసుపు కూడా ప్రతిరోజు మనం ఏ వంటలు చేసుకున్న వినియోగిస్తాం. ఇది మన సాంప్రదాయ మందుల్లో కూడా వినియోగిస్తారు. పసుపు యాంటీ బ్యాక్టిరియల్ గుణాలు కలిగి ఉంటుంది. ఇందులో నయం చేసే గుణాలు పుష్కలంగా ఉంటాయి. పసుపులో శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణం కలిగి ఉంటుంది.
యాలకులు..
యాలకులు మనం స్వీట్స్ లో వినియోగిస్తాము. యాలకుల్లో కూడా ఇన్ఫ్లమే గుణాలు ఉంటాయి. జాయింట్ పెయింట్స్, ఆర్థరైటీస్ సమస్యలకు ఎఫెక్టీవ్ రెమిడీ.
మిరియాలు..
సాధారణంగా మిరియాలను 'కింగ్ ఆఫ్ స్పైస్' అని కూడా పిలుస్తారు. వీటిని ప్రపంచవ్యాప్తంగా అందరూ వినియోగిస్తారు. మిరియాల కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. అయితే నల్లమిరియాలు కీళ్ల నొప్పులను వాపు సమస్యలను తగ్గిస్తుంది.
ఇదీ చదవండి:విటమిన్ D పుష్కలంగా ఉండే 7 గింజలు ఇవే.. మీ డైట్ లో ఉన్నాయా?
జిన్సాంగ్..
జిన్సాంగ్ గత ఏళ్లుగా ఆయుర్వేదిక మెడిసిన్లలో ఉపయోగిస్తారు. ఇందులో శరీర ఆరోగ్యానికి మేలు చేసే ప్రయోజనాలు కలిగి ఉంది. ఇది కూడా వాపు నొప్పి సమస్యలను సమర్థవంతంగా తగ్గిస్తుంది.జిన్సాంగ్ టి వంటివి చేసుకొని తీసుకోవచ్చు.
గ్రీన్ టీ..
గ్రీన్ టీ చాలామంది తాగుతున్నారు. ఇందులో పాలిఫైనల్స్ ఉంటాయి. గ్రీన్ టీ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది వాపు నొప్పి సమస్యలను తగ్గిస్తాయి ఆర్థరైటిస్ కీళ్ల నొప్పులతో బాధపడేవారు గ్రీన్ టీ ని డైట్ లో చేర్చుకోవాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి