Kabuli Chana For Weight Loss, Belly Fat: ఆధునిక జీవన శైలిని అనుసరించే చాలా మందిలో ఊబకాయం వంటి సమస్యలు వస్తున్నాయి. అంతేకాకుండా చాలా మంది మధుమేహం, రక్త పోటు సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు వివిధ రకాల ఇంటి చిట్కాలను వినియోగిస్తున్నారు. అంతేకాకుండా జిమ్‌లో గంటల తరబడి వ్యాయామాలు కూడా చేస్తున్నారు. అయితే శరీర బరువును నియంత్రించుకోవడానికి తప్పకుండా ఆహారంలో తెల్ల శనగలను వినియోగించాల్సి ఉంటుంది. దీనిని వినియోగించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. అయితే బరువు తగ్గడానికి తెల్ల శనగలను ఎలా వినియోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెల్ల శనగలలో ఉండే పోషకాలు:
పోషకాహార నిపుణుల తెలిపిన వివరాల ప్రకారం.. 28 గ్రాముల తెల్ల శనగలలో 102 కేలరీలు లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో 40 శాతం ఫైబర్, 70 శాతం ఫోలేట్, 22 శాతం ఐరన్ ఉంటుంది. కాబట్టి శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ సులభంగా కరుగుతుంది. దీంతో సులభంగా శరీర బరువు తగ్గుతారు. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్‌ను నియంత్రించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా రక్త పోటు సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


బరువు తగ్గడానికి సహాయపడుతుంది:
తెల్ల శనగలలో పీచు, ప్రోటీన్  సమృద్ధిగా లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజూ ఆహారంలో వీటిని తీసుకోవడం వల్ల సులభంగా 25 శాతం శరీర బరువును నియంత్రించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.


తెల్ల శనగలతో దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి:
ఇప్పటికే ప్రోటీన్‌ సమస్యలతో బాధపడేవారు తెల్ల శనగలను తీసుకోకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే ఇందులో శరీర ప్రోటీన్లను తగ్గించే చాలా రకాల గుణాలు ఉన్నాయి. కాబట్టి దీని వల్ల గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు కూడా వస్తాయి.


తెల్ల శనగలు తినడానికి సరైన సమయం:
తెల్ల శనగలను కేవలం అల్పాహారంలో తీసుకుంటే శరీరానికి మంచి ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. రాత్రి భోజనం చేసిన తర్వాత హఠాత్తుగా ఆకలిగా అనిపించినా తినవచ్చు. వీటిని నీటిలో నానబెట్టి నీటిలో ఉడకబెట్టుకుని తినడం వల్ల శరీరం దృఢంగా తయారవుతుంది.


Also Read: CM Jagan Mohan Reddy: వ్యవసాయ కనెక్షన్లపై సీఎం జగన్ కీలక నిర్ణయం.. ఇక నుంచి మరింత వేగం


Also Read: Minister Gummanur Jayaram: మంత్రి గుమ్మనూరు కుటుంబంలో తీవ్ర విషాదం   



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి