Kidney Disease: ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వెంటాడుతున్న వ్యాధుల్లో మధుమేహంతో పాటు మరో ముఖ్యమైంది కిడ్నీ వ్యాధి. ఈ రెండూ ఆహారపు అలవాట్లు, జీవనశైలి సక్రమంగా లేక తలెత్తుతున్న వ్యాధులు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే కిడ్నీల సంరక్షణ పూర్తిగా మన చేతుల్లో ఉన్నదే కావడం గమనార్హం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిత్య జీవితంలో ఎదురయ్యే చాలా వరకూ వ్యాధులకు కారణం ఆహారపు అలవాట్లు, జీవనశైలి. ముఖ్యంగా మధుమేహం, కిడ్నీ వ్యాధులకు కారణం ఇదే. అందుకే ఆహారపు అలవాట్లు, జీవనశైలి సక్రమంగా మార్చుకుంటే ఈ రెండు వ్యాధుల్నించి సంరక్షించుకోవచ్చు. కిడ్నీ వ్యాధి కారణంగా శరీరంలో వివిధ రకాల ఇతర సమస్యలు ఉత్పన్నమౌతాయి. కిడ్నీ వ్యాధుల్నించి రక్షించుకోవాలంటే కొన్ని ఆహార పదార్ధాలను పూర్తిగా దూరం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మన శరీరంలో కీలకమైన ఫిల్టరింగ్ ప్రక్రియను చేపట్టేది కిడ్నీలే. ఈ ప్రక్రియ సమర్ధవంతంగా ఉండేందుకు ప్రతి మనిషికి రెండు కిడ్నీలు ఉంటాయి. కొన్ని రకాల ఆహార పదార్ధాలను దూరం చేయడం ద్వారా కిడ్నీ సమస్యల్ని తగ్గించవచ్చు.


కిడ్నీ వ్యాధిగ్రస్థులు ఏం తినకూడదు


ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఇష్టంగా తాగే పానీయం కాఫీ. రోజు ప్రారంభం టీ లేదా కాఫీతో ఉంటుంది. ఈ రెండు కాస్సేపు మనస్సుకు హాయినిస్తాయి గానీ దీర్ఘకాలంలో ఆరోగ్యానికి హాని చేకూరుస్తాయి. ముఖ్యంగా కిడ్నీ ఆరోగ్యానికి కాఫీలో ఉండే కెఫీన్ మంచిది కానేకాదు. కిడ్నీ రోగులతై పూర్తిగా దూరం పెట్టాలి.


పొటాషియం ఎక్కువగా ఉండే పదార్ధాలు కిడ్నీ రోగులకు మంచిది కాదు. వాస్తవానికి పొటాషియం కీలకమైన మినరల్స్‌లో ఒకటి. నరాలు, కండరాల పనితీరు సక్రమంగా ఉంచడంలో ఉపయోగపడే మినరల్ ఇది. అయితే మోతాదు మించకూడదు. ముఖ్యంగా కిడ్నీ వ్యాధిగ్రస్థులకు అధిక పొటాషియం హాని కల్గిస్తుంది. అందుకే అరటి పండు, ఆరెంజ్, బంగాళదుంప వంటి పదార్ధాలను సాధ్యమైనంతవరకూ తగ్గించాలి.


రెడ్ అండ్ ప్రోసెస్డ్ మాంసం పూర్తిగా దూరం పెట్టాలి. ఇందులో ప్రోటీన్లు అధికంగా ఉండటమే కాకుండా శరీరంలో వ్యర్ధ పదార్ధాలు ఎక్కువగా పేరుకుపోతాయి. ఫలితంగా కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది కిడ్నీ వ్యాధిగ్రస్థులకు సమస్యగా మారవచ్చు. అందుకే మటన్, బీఫ్, పోర్క్ వంటివి పూర్తిగా మానేయాలి.


సోడియం ఎక్కువగా ఉండే పదార్ధాలు కూడా దూరం పెట్టాలి. సోడియం అంటే ఉప్పు తినే ఆహార పదార్ధాల్లో పూర్తిగా మానేయడం లేదా తగ్గించడం చేయాలి. రోజుకు 4 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు ఆరోగ్యానికి మంచిది కాదు. ఉప్పు అనేది కిడ్నీలను డ్యామేజ్ చేస్తుంది. కిడ్నీ వ్యాధిగ్రస్థులకు ఇది విషంతో సమానం. రెడీ మేడ్ ఫుడ్స్, ప్యాకెట్ ఫుడ్స్, సాల్టెడ్ చిప్స్, ఫాస్డ్ ఫుడ్స్ అందుకే తినకూడదు. ఈ పదార్ధాలను డైట్ నుంచి దూరం చేయడం ద్వారా చాలావరకూ కిడ్నీలను సంరక్షించుకోవచ్చు.


Also read: Protein Foods: ప్రోటీన్లంటే గుడ్డు ఒక్కటే కాదు, ఈ పదార్ధాలు కూడా ట్రై చేయవచ్చు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook