Kidney Stones Removal In 5 Days: ప్రస్తుతం కిడ్నీ సమస్యలు సర్వసాధరణమైపోయాయి. ముఖ్యంగా కిడ్నీలో రాళ్ల సమస్య, కిడ్నీలు ఫెయిల్‌ అవ్వడం వంటి సమస్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ సమస్యలు యువతలో వేగగంగా పెరగడం విశేషం. అయితే కిడ్నీల్లో రాళ్ల విషయానికొస్తే.. వీటి లక్షణాలను ముందుగానే గ్రహించి పలు రకాల జాగ్రత్తలు పాటించడం చాలా మేలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లేదంటే మూత్ర సంబంధిత సమస్యలు, ఇన్ఫెక్షన్లు, కిడ్నీలు దెబ్బతింటాయని నిపుణులు తెలుపుతున్నారు. సకాలం చికిత్స పొందితే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. అయితే ఇదే క్రమంలో ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అయితే ఇప్పుడు కిడ్నీల్లో స్టోన్స్‌ లక్షణాలు, నివారణ చర్యలు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కిడ్నీలో రాళ్లు రావడానికి ప్రధాన కారణాలు ఇవేనా?


మెడికల్ నివేదికల ప్రకారం.. కిడ్నీలో మినరల్స్ కరిగిపోవడం వల్ల  రాళ్లు ఏర్పడతాయని పేర్కొన్నాయి. ముఖ్యంగా సరైనా మోతాదులో మంచి నీరు ద్రవపదార్థాలు తీసుకోకపోవడం ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని.. కావును నీరును అధిక శాతం తీసుకోవాలని నివేదికలు సూచిస్తున్నాయి. అయితే పలు నివేదికలు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ చేపక పోవడం వల్లే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతన్నాయని చెబుతున్నాయి. వాతావరణ మార్పుల వల్ల కూడా  మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే చాన్స్‌ ఉందని నివేదికలు పేర్కొన్నాయి. కొంతమందిలో దీని కారణంగా ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు వంటి అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని నివేదికలు తెలుపుతున్నాయి.


కిడ్నీల్లో స్టోన్‌ను ఉంటే ఈ లక్షణాలు కనిపిస్తాయి:


కిడ్నీల్లో రాళ్లు పెరగడం ప్రారంభ దశలో ఉంటే స్వల్ప లక్షణాలు కనిపిస్తాయి. అయితే వీటిని ముందుగానే గమనించి జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే కిడ్నీల్లో రాళ్లు పగిలిపోతే.. కొందరిలో మూత్రం ద్వారా బయటకు వస్తాయి. అయితే మూత్రపిండాల్లో రాళ్లు పెద్దగా పెరిగితే తప్పకుండా ఈ లక్షణాలు మీలో కనబడుతాయి. ముఖ్యంగా చాలా మందిలో పొట్ట రెండు వైపులా నొప్పి, మూత్రంలో రక్తం, వాంతులు, వికారం, జ్వరం, చలి, బలహీనత, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. కిడ్నీలో రాళ్లు మూత్ర విసర్జనను అడ్డుకుంటే.. చాలా రకాల తీవ్రమైన ఇన్ఫెక్షన్ రావచ్చని నిపుణులు తెలుపుతున్నారు. అయితే కిడ్నీల్లో రాళ్లు అధిక పరిమాణంలో పెరిగితే   దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ప్రమాదం పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


ఈ జాగ్రత్తలు తీసుకోవాలి:


ప్రతిరోజూ 6 నుంచి 7 లీటర్ల నీటిని తీసుకోవాలి. అప్పుడే ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా తీసుకునే ఆహారపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఉప్పు గల ఆహారం.. సోడాలకు దూరంగా ఉండాలి. అంతే కాకుండా ఎలాంటి సమస్య వచ్చినా డాక్టర్‌ను సంప్రదించాలి.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)   


Also Read: Priya Prakash Varrier: ఏకంగా బాత్రూంలో ఫోటోలు షేర్ చేసిన ప్రియా ప్రకాష్.. అలా పడుకుని మరీ అందాల విందు!


Also Read: Radhana Ram: ఇండస్ట్రీకి మరో వారసురాలు..ఏకంగా పాన్ ఇండియన్ మూవీలో హీరోయిన్ గా ఎంట్రీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook