COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Yoga For Knee And Joint Pain: వయసుతో సంబంధం లేకుండా చాలామంది కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు సమస్యల బారిన పడుతున్నారు. వాతావరణం లో తేమ పెరగడం కారణంగా ఈ సమస్యలు రెట్టింపు అవుతూ ఉంటాయి. అంతేకాకుండా నొప్పుల తీవ్రత కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు చలికాలంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వీరు ఈ సమయంలో కండరాలను బలోపేతం చేసుకోవడం చాలా ముఖ్యం. 


మోకాళ్ళ నొప్పులు, కీళ్లనొప్పులతో బాధపడేవారు తప్పకుండా ఈ సమయంలో ఆధునిక జీవనశైలికి దూరంగా ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా అతిగా నూనె ఉండే పదార్థాలను ఈ సమయాల్లో తినడం మానుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు తప్పకుండా కొన్ని ప్రత్యేక యోగాసనాలు చేయాల్సి ఉంటుంది. వీటిని చేయడం వల్ల మోకాళ్లలోని రక్తప్రసరణ పెరిగి నొప్పుల నుంచి సులభంగా లభిస్తుంది.


త్రికోణాసనం:
ప్రతిరోజు త్రికోణాసనం చేయడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా కండరాలు కూడా బలోపేతం అవుతాయని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ ఆసనం చేయడానికి ముందుగా నిటారుగా నిలబడి ఉండాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ కాళ్ళ మధ్యలో సుమారు రెండు అడుగుల దూరాన్ని ఉంచి.. దీర్ఘంగా ఊపిరి పీల్చుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎడమ చేతిని పైకి కదుపుతూ వేళ్లను మీ కళ్ళను దాకాల్సి ఉంటుంది. ఆ తర్వాత సాధారణ స్థితిలోకి రావాల్సి ఉంటుంది. ఇలా ప్రతిరోజు 20 నిమిషాల పాటు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.


Also Read:  King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం  


గరుడాసనం:
ప్రతిరోజు గురుడాసనాన్ని వేయడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా శరీరానికి తగిన విశ్రాంతి కూడా లభిస్తుంది. అయితే ఈ ఆసనాన్ని చేయడానికి ముందుగా నేలపై నిటారుగా నిలబడి ఉండాల్సి ఉంటుంది. ఆ తర్వాత కుడి మోకాలని వంచి.. మీ ఎడమ పాదం మీద నిలబడాల్సి ఉంటుంది. ఆ తర్వాత కుడి పాదాన్ని ఎడమవైపు ముందుకి, వెనకకి కదులుతూ ఉండాల్సి ఉంటుంది. ఇదే సమయంలో కుడి తొడలను ఎడమ వైపుకు కుడివైపుకు కదిలించాల్సి ఉంటుంది. ఆ తర్వాత రెండు చేతులను ముందుకు వెనుకకు తీసుకు వెళ్తూ మోచేతులను మంచి క్రాస్ చేయాలి. ఇలా ప్రతిరోజు 10 నిమిషాల పాటు చేయడం వల్ల శరీరానికి తగిన విశ్రాంతి లభిస్తుంది. అంతేకాకుండా మోకాళ్ళ నొప్పులు కూడా సులభంగా దూరమవుతాయి.


Also Read:  King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.