Knee Pain Remedies: మారుతున్న జీవనశైలీ, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మందిలో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. సాధారణంగా 40 ఏళ్లు పైబడిన తర్వాత కీళ్ల నొప్పులు రావడం సహజమే. కానీ, ఈరోజుల్లో చిన్న వయసులోనే చాలా మంది మోకాళ్ల లేదా కీళ్ల నొ    ప్పులతో బాధపడుతున్నారు. ఆహారంలో పోషకాల కొరత కారణంగా ఈ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. అందుకే రోజువారీ తినే ఆహారంలో కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలను చేర్చుకోవడం చాలా ముఖ్యం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మోకాలి నొప్పి ఎందుకు వస్తుంది?


మీరు శరీరంలో కాల్షియం లేదా ప్రోటీన్ లోపం కారణంగా మోకాలి నొప్పులు వచ్చే అవకాశం ఉంది. వీటి లోపం వల్ల కొన్నిసార్లు కీళ్ల వాపులు రావొచ్చు. అలాంటి పరిస్థితుల్లో మనం చేయాల్సిన పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 


మోకాళ్ల నొప్పులు నివారణకు తీసుకోవాల్సిన ఆహారం..


1. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్


క్యాబేజీ, బ్రోకలీ వంటి ఆకుకూరలు తినడం వల్ల శరీరంలో నొప్పులను కలిగించే ఎంజైమ్‌లు తగ్గుతాయి. అందువల్ల మీ రోజువారీ ఆహారంలో వీటిని చేర్చుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి.


2. డ్రైఫ్రూట్స్


నట్స్‌లో విటమిన్లు, ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నందున ఆరోగ్య నిపుణులు తరచుగా వాటిని తినమని సిఫార్సు చేస్తారు. ఇది ఎముకలను బలపరుస్తుంది. అందుకే నట్స్ తినడం వల్ల మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి.


3. అల్లం, పసుపు


అల్లం, పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. అందుకే ఈ మసాలా దినుసులు శతాబ్దాలుగా ఔషధంగా ఉపయోగిస్తున్నారు. మోకాళ్ల నొప్పులు ఉంటే కచ్చితంగా ఈ రెండు విషయాలను డైట్ లో చేర్చుకోవడం మేలు. అల్లం, పసుపు కలిపి కషాయం చేసి తాగినా మంచి ఫలితం ఉంటుంది.


4. పండ్లు


శరీరానికి ఆరోగ్యాన్నిచ్చే పండ్లను తినడం వల్ల మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. వీటిలో నారింజ, స్ట్రాబెర్రీ, చెర్రీస్ ఉన్నాయి. వీటిలో విటమిన్ సి, లైకోపీన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఎముకల వాపును కూడా తగ్గిస్తాయి.


5. పాలు


పాలలో విటమిన్ - డి, కాల్షియం వంటి అన్ని పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఎముకల బలానికి మేలు చేస్తాయి. అయితే పాలలో ఉండే కొవ్వు ఉండడం వల్ల బరువు పెరుగుతారు. 


(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా కొన్ని నివేదికలు, చిట్కాల నుంచి గ్రహించినది. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)   


Also Read: Desi Ghee Benefits: ఉదయాన్నే నెయ్యి తినడం వల్ల ఈ ఆరోగ్య సమస్యలు మటుమాయం!


Also Read: Diabetes: డయాబెటిస్ సమస్యగా ఉందా..ఈ జ్యూస్‌లు తాగితే చాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.