Grapes Health Benefits: ద్రాక్షపళ్లు అందరికీ ఇష్టమే. ఇష్టం కాబట్టే అందని ద్రాక్ష పుల్లన అనే పేరొచ్చింది. వేసవి కాలంలో ద్రాక్షపళ్లతో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటన్నారు వైద్య నిపుణులు. ఆ ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రకృతిలో లభించే ఎన్నోరకాల పండ్లలో ద్రాక్ష ఒకటి. సహజంగానే అందరికీ ఇష్టమైనవి. అయితే వేసవి కాలంలో ద్రాక్ష తరచూ తీసుకుంటే చాలా రకాల వ్యాధుల్నించి రక్షించుకోవచ్చని చాలామందికి తెలియదు. ద్రాక్షలో పోషక పదార్ధాలు చాలా ఎక్కువే. ఇది శరీరంలో ఇమ్యూనిటీ సిస్టమ్ పెంచుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు ద్రాక్షలో సమృద్ధిగా ఉన్నాయి. ద్రాక్షలో విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.


ద్రాక్షలో ఉండే న్యూట్రియంట్లు ఇవే


ద్రాక్షలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బితో పాటు పొటాషియం, కాల్షియంలు తగిన మోతాదులో లభిస్తాయి. ఫ్లెవనాయిడ్స్ కూడా ద్రాక్షలో ఎక్కువగా లభిస్తాయి. అంటే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ద్రాక్షలో ఉంటాయి. ఇవి శరీరానికి చాలా ప్రయోజనం చేకూరుస్తాయి. అంతేకాదు..ద్రాక్షలో తగిన మోతాదులో ఉండే కేలరీలు, ఫైబర్, గ్లూకోజ్, మెగ్నీషియం, సిట్రిక్ యాసిడ్ వంటి చాలా పోషకాలున్నాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేకూరుస్తాయి.


కళ్లకు ప్రయోజనకరం


ద్రాక్షలో విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది. ఇది కంటికి చాలా మంచిది. కంటికి సంబంధించిన సమస్యలు దూరం చేయాలంటే..ద్రాక్షను డైట్‌లో చేర్చుకోండి.


డయాబెటిస్‌కు ఔషధం


మధుమేహంతో బాధపడుతున్నవారు ద్రాక్ష తినడం మంచిది. ఇది శరీరంలో షుగర్ స్థాయిని తగ్గించే పని చేస్తుంది. అంతే కాదు ద్రాక్షలో ఐరన్ కూడా సమృద్ధిగా లభిస్తుంది. 


ఎలర్జీ దూరం


కొంతమందికి స్కిన్ ఎలర్జీ ఉంటుంది. ద్రాక్షలో ఉండే యాంటీ వైరల్ గుణాలు చర్మ సంబంధిత వ్యాధులు, ఎలర్జీని దూరం చేసేందుకు ద్రాక్ష చాలా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే యాంటీ వైరల్ గుణాలు పోలియో, వైరస్, వంటివాటితో పోరాడేందుకు కూడా ఉపయోగపడతాయి.


కేన్సర్ నుంచి రక్షణ


ద్రాక్షలో గ్లూకోజ్, మెగ్నీషియం, సిట్రిక్ యాసిడ్ వంటి చాలా గుణాలున్నాయి. ద్రాక్షతో టీబీ, కేన్సర్, బ్లడ్ ఇన్ఫెక్షన్ వంటి వ్యాధులు నియంత్రించవచ్చు. ద్రాక్షతో కేన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల్నించి కూడా రక్షించుకోవచ్చు


బ్రస్ట్ కేన్సర్ నుంచి రక్షణ


గుండెపోటు సమస్య ఉన్నవాళ్లు..ద్రాక్ష రోజూ తీసుకుంటే చాలా మంచిదనేది వైద్యుల అభిప్రాయం. ఓ అధ్యయనం ప్రకారం బ్రస్ట్ కేన్సర్ నియంత్రించేందుకు ద్రాక్ష చాలా ఉపయోగకరం.


Also read: Cucumber Health Benefits: వేసవిలో కీరాతో కలిగే 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు, బ్యూటీ చికిత్స


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook