Health Benifits of Bael Juice: వేసవి కాలంలో శరీరం డీహైడ్రేట్ అవకుండా ఉండాలంటే మంచి నీరు ఎక్కువగా తాగాలి. అలాగే, పండ్ల రసాలు తీసుకుంటే మరింత మంచిది. వేడిమి, ఉక్కపోత కారణంగా ఎక్కువ చెమట రావడం.. శరీరం నుంచి నీరు ఎక్కువగా బయటకు పోవడం జరుగుతుంది. కాబట్టి పండ్ల రసాలు తీసుకుంటే శరీరం హైడ్రేట్‌గా ఉండటంతో పాటు తగినన్ని పోషకాలు లభిస్తాయి. పండ్ల రసాల్లో ఇవాళ మనం వెలగపండు జ్యూస్ ద్వారా కలిగే బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 బేల్ రసం వేసవిలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మొదట, మీరు తినడానికి ముందు వేడిని అనుభవించలేరు. ఇది కాకుండా, వేడిని నివారించడానికి దీనిని సర్వరోగ నివారిణి అని పిలుస్తారు. దీనితో పాటు, మలబద్ధకం సమస్య నుండి రక్తాన్ని శుభ్రపరిచే వరకు, బేల్ రసం కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది కాకుండా, బేల్ జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి.


రోగ నిరోధక శక్తి పెరుగుతుంది :


వెలగపండు జ్యూస్ తాగితే తాగితే రోగ నిరోధక శక్తి మరింత పటిష్టమవుతుంది. ఇందులో ప్రోటీన్, బీటా-కెరోటిన్, థయామిన్, రిబోఫ్లావిన్, విటమిన్ సి వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ జ్యూస్ తీసుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరిగి ఎలాంటి వ్యాధులనైనా శరీరం తట్టుకోగలదు.


రక్తాన్ని శుద్ధి చేస్తుంది:


వెలగపండు జ్యూస్ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్తాన్ని శుభ్రపరచడానికి అనేక రకాల మందులు అందుబాటులో ఉన్నప్పటికీ.. ప్రకృతిలో దొరికే వెలగపండును తినడం ద్వారా సహజ పద్దతిలోనే రక్త శుద్ధి జరుగుతుంది.


గుండె జబ్బులు దూరం :


వెలగపండు జ్యూస్‌లో కాస్త నెయ్యి కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీని వల్ల గుండె జబ్బులు దూరమవుతాయి. గుండెపోటు వచ్చే ముప్పు తగ్గుతుంది.


స్త్రీల ఆరోగ్యానికి :


వెలగపండు జ్యూస్ స్త్రీల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది రొమ్ము క్యాన్సర్ బారి నుంచి రక్షిస్తుంది. బాలింతలకు వెలగపండు చాలా మేలు చేస్తుంది. వెలగపండు జ్యూస్ తాగడం ద్వారా పాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి.


వెలగపండు జ్యూస్ ఎప్పుడు తాగాలి :


ఉదయం లేదా మద్యాహ్నం ఖాళీ కడుపుతో వెలగపండు జ్యూస్ తాగవచ్చు. తిన్న వెంటనే లేదా టీ, కాఫీ తాగిన తర్వాత ఈ జ్యూస్ తాగవద్దు. అలా చేస్తే ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది. 


(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు కచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)