Cucumber Summer Health Benefits : వేసవి వేడిని ఎలా ఎదుర్కోవాలనుకుంటున్నారా..ప్రకృతిలో లభించే సమ్మర్ స్పెషల్ ఫ్రూట్స్ అందుకు దోహదపడతాయి. అందులో కీలకమైంది కీరా.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కీరా 95 శాతం నీటిని కలిగి ఉంటుంది. అందుకే వేసవిలో అద్భుతమైన ఫ్రూట్ ఇది. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతూ శరీరాన్ని డీటాక్సిఫై చేస్తుంది. చెడు శ్వాసను కూడా కీరా నిరోధిస్తుంది. కీరాతో కలిగే ఏడు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.


భారత ఉపఖండంలో వేసవి ప్రభావం స్పష్టంగా కన్పిస్తోంది. రోజురోజుకూ ఎండల తీవ్రత పెరుగుతోంది. ఎండ వేడికి, ఉక్కపోతకు ప్రజానీకం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో మనం తీసుకునే డైట్ సక్రమంగా ఉండేట్టు చూసుకోవల్సిన అవసరముంది. కొన్నిరకాల ఆహార పదార్ధాలు లేదా పండ్లతో శరీరంలోపలి ఉష్ణోగ్రతను తగ్గించుకోవచ్చు. బాడీని డీహైడ్రేట్ కాకుండా నివారించవచ్చు. ఇందులో ముఖ్యమైంది కుకుంబర్ లేదా కీరా. ఇది శరీరాన్ని డీటాక్సిఫై చేస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కీరాతో కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం...


కీరా 95 శాతం నీటితో కలిగి ఉండటంతో బాడీని అద్భుతంగా హైడ్రేట్ చేస్తుంది. శరీరంలోని విష పదార్ధాల్ని తొలగించి ఆరోగ్యంగా ఉంచుతుంది. కీరా అనేది క్లీన్సింగ్ ఏజెంట్‌లా పనిచేస్తుంది. వ్యర్ధ పదార్ధాల్ని తొలగిస్తుంది.


కీరా జ్యూస్ ముఖంపై రాసుకుంటే చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ముఖ్యంగా డ్రై స్కిన్‌తో ఇబ్బంది పడేవారికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. 


కీరా అనేది బ్యూటీ చికిత్సలో ఎక్కువగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా డార్క్ సర్కిల్స్ తగ్గించేందుకు  ఉపయోగపడుతుంది. కళ్ల చుట్టూ ఏర్పడే నల్లటి వలయాల్ని నియంత్రిస్తుంది. 


చాలామందికి తెలియని విషయమిది. కీరా అనేది కడుపులో ఉండే అధిక వేడిని నిర్మూలిస్తుంది. చెడు శ్వాసకు కారణమిదే. కేవలం ఓ ముక్క కీరాను నోట్లో ఉంచుకుంటే బ్యాక్టిరియా తొలగిపోతుంది. 


కీరా అనేది పూర్తిగా బ్యూటీ థెరపీ ఆహారంగా మారింది. ఇది చర్మానికే కాకుండా గోర్లు, వెంట్రుకలకు ఉపయోగపడుతుంది. ట్యానింగ్ కోసం కీరా బాగా ఉపయోగపడుతుంది. 


కీరాలో అత్యధికంగా ఉండే ఫైబర్ కారణంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బరువు తగ్గేందుకు కీరా చాలా ఉపయోగపడుతుంది. 


ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం, పైబర్ లెవెల్స్ కారణంగా రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. 


Also read: Watermelon: వేసవిలో పుచ్చకాయలో కలిగే ఆరు అద్భుత ప్రయోజనాలు, తెలిస్తే వదిలిపెట్టరిక


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook