COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Korean Barley Tea For Weight Loss: గోధుమల్లో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. అందుకే చాలా మంది వీటితో తయారు చేసిన రోటీలను ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం మార్కెట్‌లలో రెండు(ఒకటి దేశీ బార్లీ, రెండవది కొరియన్ బార్లీ) రకాల గోధుమలు లభిస్తున్నాయి. దేశీ బార్లీ కంటే కొరియన్ గోధుమలు శరీరానికి పది రేట్లు ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. చాలా మంది వీటిని టీలా తాయరు చేసుకుని కూడా తాగుతారని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు చర్మానికి పోషణనిచ్చి కాంతివంతంగా చేసేందుకు సహాయపడతాయి. ఈ టీని ప్రతి రోజు తాగడం వల్ల శరీరానికి ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


కొరియన్ బార్లీ టీ ప్రయోజనాలు:
బరువు తగ్గుతారు:

ఉదయాన్నే ఖాళీ కడుపుతో బార్లీ టీని తీసుకుంటే శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా శరీర బరువు కూడా తగ్గుతారని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా ఈ టీని ట్రై చేయండి.


చర్మం హైడ్రేట్:
చర్మ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు కొరియన్ బార్లీతో తయారు చేసిన టీని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఈ టీ తాగడం వల్ల చర్మం హైడ్రేట్ అవ్వడమే కాకుండా చర్మాన్ని డిటాక్సిఫై చేస్తుంది.


Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  


జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:


ఈ బార్లీ టీలో ఫైబర్  అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఈ కొరియన్ బార్లీ టీని తాగడం వల్ల  గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా వాంతులు, వికారాన్ని తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయి.


రక్తాన్ని శుద్ధి చేస్తుంది:
గోధుమలతో తయారు చేసిన టీని ప్రతి రోజు తాగితే రక్తం శుద్ధి అవుతుంది. అంతేకాకుండా రక్తంలోని పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ కూడా తొలగిపోతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా గుండెపోటు సమస్యలు రాకుండా ఉంటాయి. 


ఒత్తిడిని తగ్గిస్తుంది:
బార్లీ టీలో అమినో యాసిడ్‌లు, మెలటోనిన్, ట్రిప్టోఫాన్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు తాగితే నిద్రలేమి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. దీంతో పాటు ఒత్తిడి సమస్యలు కూడా సులభంగా తగ్గుతాయి. 


Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook