Anti Aging Pill: ఎప్పటికీ యౌవనంగా ఉండాలనే కోరిక నెరవేరనుంది. కొరియన్ శాస్త్రవేత్తలు అద్భుతం సృష్టించారు. వృద్ధాప్యాన్ని జయించే మందు కనిపెట్టేశారు. వ్యాయామం వంటివేవీ చేయాల్సిన అవసరం లేదు. యాంటీ ఏజీయింగ్ పిల్ వేసుకుంటే చాలు వృద్ధాప్య ఛాయలు మాయం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అప్పుడెప్పుడో దేవతల కాలంలో కాదు..ఇప్పుడు సైంటిస్టులు సరికొత్త అమృతాన్ని కనిపెట్టేశారు. ఒక్క పిల్ వేసుకుంటే చాలు..ఇక వృద్ధాప్యం దరి చేరదు. ఆశ్చర్యంగా ఉందా...నిజమే మరి..ఏజీయింగ్ అనేది సహజసిద్ధంగా జరిగే ప్రక్రియ. వయస్సుతో పాటు వృద్ధాప్యం వస్తుంటుంది. ఈ పరిస్థితిని నియంత్రించేందుకు చాలాకాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇటు ఎవరికివారు డైటింగ్, వ్యాయామం వంటివి చేస్తూ ఏజీయింగ్ రాకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడీ విషయంలో కొరియన్ శాస్త్రవేత్తలు గుడ్‌న్యూస్ విన్పించారు. IU1 అనే సరికొత్త మందు కనిపెట్టారు. ఈ మందుతో వృద్ధాప్య లక్షణాలతో పాటు వయస్సు సంబంధిత వ్యాధులకు చెక్ చెప్పవచ్చంటున్నారు. 


కొరియాలోని చుంగ్ ఆంగ్ యూనివర్శిటీ రీసెర్చ్ టీమ్ ప్రొఫెసర్ సేవోగాంగ్ హయూన్ నేతృత్వంలో ఈ రీసెర్చ్ కొనసాగింది. దీనికి సంబంధించిన వివరాలు ఆటోఫేగీ జర్నల్‌లో ప్రచురితమైంది. ప్రోటీన్ల నాణ్యత, నియంత్రణ వ్యవస్థ, ప్రోటీసోమ్, ఆటోఫేగీ మధ్య సంబంధాలపై పరిశోధించి ఏజీయింగ్ నియంత్రించే శక్తివంతమైన మందును కనుగొన్నారు. ఈ మందును ఇప్పటికే ఎలుకలపై ప్రయోగించి విజయవంతం చేశారు. ఎలుకల్లో వయస్సు పెరిగే ప్రక్రియను మందగించేలా చేశారు. దాంతోపాటు ఎలుకల్లో కొత్త ఎనర్జీ కన్పించింది. చర్మంలో మార్పు కన్పించింది. ఇవన్నీ యాంటీ ఏజీయింగ్ గుణాలే. ఇప్పుడిక హ్యూమన్ ట్రయల్స్ మిగిలి ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఈ మందు ద్వారా కేవలం ఏజియింగ్ ప్రక్రియను నిరోధించడమే కాకుండా జీవన ప్రమాణాలను కూడా మెరుగుపర్చాలని పరిశోధకులు కోరుకుంటున్నారు. 


త్వరలో మనుషులపై ప్రయోగాలు పూర్తి చేశాక ఈ మందు ఎంతవరకు సమర్ధవంతంగా పనిచేస్తుందనేది తేలనుంది. అదే జరిగితే నిజంగానే ఇది ఆధునిక శాస్త్ర విజ్ఞానంలో సరికొత్త ఆవిష్కరణ కానుంది. ఎన్నో ప్రశ్నలకు సమాధానం అవుతుంది. సరికొత్త విప్లవానికి నాంది అవుతుంది. 


Also read: Green Tea Tips: గ్రీన్ టీ తాగే అలవాటుందా అయితే ఈ 7 తప్పులు చేయవద్దు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.