Lemon Drinks for Kidney: కిడ్నీ శరీరంలో ప్రధాన భాగం.. ఇది రక్తాన్ని శుభ్రపరచడానికి, శరీరంలోని వ్యర్థాలను తొలగించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అయితే శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ వల్ల కిడ్రీలు ఫెయిల్‌ అవుతున్నాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు కూడా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కిడ్నీ సమస్యలు కూడా దూరమవుతాయి. అయితే దీని కోసం ఎలాంటి డ్రింక్స్‌ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శరీరంలో మూత్రపిండాల ప్రాముఖ్యత:
మూత్రపిండాల ప్రధాన విధి శరీరంలోని మురికిని, ద్రవాలను మూత్రం ద్వారా శరీరం నుంచి తొలగించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా శరీరంలోని ఉప్పు, పొటాషియం, యాసిడ్ పరిమాణాలను కూడా నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరానికి అవసరమైన హార్మోన్లు కూడా మూత్రపిండాల నుంచి విడుదల చేస్తుంది.


నిమ్మకాయ మూత్రపిండాలకు మేలు చేస్తుందా?:
హార్వర్డ్ నివేదిక ప్రకారం.. రోజూ రెండు సార్లు నిమ్మరసం తాగడం వల్ల యూరినరీ సిట్రేట్ పెరుగుతుంది. అంతేకాకుండా కిడ్నీ నుంచి టాక్సిన్స్ తొలగించడానికి సహాయపడుతుంది. రోజూ 2 నుండి 2.5 లీటర్ల మూత్ర విసర్జన చేసే వ్యక్తులు తప్పకుండా నిమ్మరసాన్ని తాగాల్సి ఉంటుంది. దీని వల్ల  కిడ్నీ హెల్తీగా కూడా మారుతుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.


కిడ్నీ కోసం నిమ్మ రసం:
1. పుదీనా, నిమ్మ రసం:
నిమ్మరసం, పుదీనా ఆకులతో తయారు చేసిన చరబతి తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా మూత్రపిండాల వ్యాధులుకు కూడా సులభంగా దూరమవుతాయి.


2. మసాలా లెమన్ సోడా:
ఒక గ్లాసులో నిమ్మరసం, జీలకర్ర-కొత్తిమీర పొడి, చాట్ మసాలా మిక్స్‌ చేసి సోడా కలపాలి. ఇలా తయారు చేసి ప్రతి రోజూ తాగడం వల్ల కిడ్నీలు హెల్తీగా మారుతాయి. సులభంగా బరువుతో పాటు కొలెస్ట్రాల్‌ కూడా సులభంగా తగ్గుతుంది.


3. కొబ్బరి నీళ్ళు:
కిడ్నీలు హెల్తీగా ఉండడానికి ప్రతి రోజూ కొబ్బరి నీళ్ళు తాగాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read:  Basil Joseph Blessed with Baby Girl : తండ్రైన దర్శకుడు!.. ఆనందంలో తేలిపోతోన్న నటుడు


Also Read: Dhanush - Hyper Aadi : హైపర్ ఆది ఎందుకు ఫేమస్ అయ్యాడో తెలీదన్న ధనుష్.. స్టేజ్ మీదే కాళ్లు మొక్కేసిన కమెడియన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook