Lemon Leaf Tea Benefits: నిమ్మ ఆకుల టీ మ్యాజిక్ ఇదే.. రోజు తాగితే ఏమవుతుందో తెలుసా?
Lemon Leaf Tea Benefits: ప్రతిరోజు లెమన్ ఆకులతో తయారు చేసిన టీ ని తాగడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులనుంచి విముక్తి కలిగిస్తాయి. అంతేకాకుండా వాంటింగ్ సెన్సేషన్‌ను పోగొట్టేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయి.
Lemon Leaf Tea Benefits: కొన్ని సంవత్సరాల కింద ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పకుండా కొన్ని రకాల పండ్ల మొక్కలు ఉండేవి. ఇవి సీజన్లను బట్టి పండ్లను ఇచ్చేవి.. ముఖ్యంగా ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పకుండా నిమ్మచెట్టు ఉండేది.. ప్రతి ఒక్కరు నిమ్మ చెట్టును పెంచి వాటి నుంచి వచ్చే పండ్లను ఇంట్లో పచ్చళ్లకు లేదా వివిధ రకాలుగా వినియోగించేవారు. అయితే కాలం మారుతున్న కొద్ది ఇంట్లో చెట్లు పెంచడం తగ్గుతూ వచ్చాయి. దీంతో పెరడ్లలోనే నిమ్మ చెట్లను పెంచడం చేస్తున్నారు. మన పూర్వీకులు ఇంటి చుట్టుపక్కల నిమ్మ చెట్టును పెంచడం మంచిదిగా భావించేవారు. ఎందుకంటే దీని నుంచి వచ్చే వాసన వల్ల వివిధ రకాల కీటకాలు నశించేవట.. అంతేకాకుండా మన పూర్వీకులు ఎక్కువగా ఈ ఆకులతో టీ ని కూడా తయారు చేసుకునేవారు. దీనితో తయారు చేసిన టీని తాగడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే కొన్ని మూలకాలు శరీరానికి తక్షణమైన శక్తిని అందిస్తాయి.
నిమ్మర సంలో విటమిన్ సితో పాటు క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్ అధిక మోతాదులో లభిస్తుంది. అయితే ఈ గుణాలు రసంలో ఉండడమే కాకుండా ఆకుల్లో కూడా ఉంటాయి. కాబట్టి రోజు ఉదయాన్నే నిమ్మ ఆకులను తినడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి ఒక్కసారిగా పెరుగుతుంది. అంతేకాకుండా ఎముకలు కూడా గట్టి పడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవే కాకుండా ఇందులో ఉండే కొన్ని పోషకాలు శరీరానికి వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి.
నిమ్మఆకుల ఆరోగ్య ప్రయోజనాలు:
ప్రతిరోజు ఉదయాన్నే పరిగడుపున నిమ్మాకులతో తయారు చేసిన టీ ని తాగడం వల్ల తలనొప్పి వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే కొన్ని గుణాలు వాంతులు, వికారం వంటి సమస్యలను తగ్గిస్తాయి. అలాగే నిమ్మ ఆకుల నుంచి వచ్చే వాసన ట్రావెలింగ్ చేసే క్రమంలో వచ్చే వాంటింగ్ ను తగ్గిస్తుంది.
ముఖ్యంగా నిమ్మ ఆకుల టీ ప్రతిరోజు తాగడం వల్ల డిప్రెషన్ తో పాటు నిద్రలేని సమస్యలు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా శ్వాసకోశ సమస్యలు దగ్గు, జలుబు, గొంతు ఇన్ఫెక్షన్లు కూడా తగ్గిపోతాయి. కాబట్టి రోజు ఉదయాన్నే ఈ సమస్యలతో బాధపడుతున్న వారు ఖాళీ కడుపుతో నిమ్మ ఆకుల దీని తాగడం ఎంతో మంచిది.
నిమ్మ ఆకుల టీ తాగితే కడుపులో ఉండే నులి పురుగులు కూడా తొలగిపోతాయి. అయితే పొట్ట సమస్యలు రాకుండా ఉండడానికి రోజు నిమ్మ ఆకుల దీని తయారు చేసుకునే క్రమంలో తప్పకుండా తేనెను వినియోగించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఇతర వ్యాధులు కూడా దూరం అవుతాయి.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
నిమ్మాకుల దీని రోజు ఉదయం తాగితే శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బెల్లీ ఫ్యాట్ నియంత్రించుకోనడానికి డైట్లు పాటించేవారు తప్పకుండా లెమన్ టీ తో పాటు ఈ టీని కూడా చేర్చుకోవడం ఎంతో మంచిది.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.