Side Effects Of Drinking Too Much Lemon Water: వివిధ ఆరోగ్య కారణాల వల్ల ఉదయాన్నే చాలా మంది నిమ్మరసం తాగడం అలవాటు చేసుకుంటారు. బరువు తగ్గడానికి కొందరు నిర్మరసం తాగితే, శరీరంలో విష పదార్థాలు తొలగిపోవాలని మరికొందరు నిమ్మరసం, తేనే కలుపుకుని తాగుతుంటారు. నిమ్మకాయలో విటమిన్ సి, సహా పలు పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. నిమ్మకాయను అధికంగా తీసుకోవడం వల్ల శరీరానికి హాని కూడా జరుగుతుంది. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. దంతాలకు నష్టం
నిమ్మకాయలో ఆమ్ల రసం ఎక్కువగా ఉంటుంది. ఆమ్లాలను అధికంగా తీసుకుంటే అవి దంతాలను దెబ్బతీస్తాయి. దంతాల సున్నితత్వానికి నష్టాన్ని కలిగిస్తుంది. సాధ్యమైతే నిమ్మరసాన్ని నేరుగా పెదవులతో తాగకుండా, స్ట్రా వాడుతూ తాగాల్సి ఉంటుంది. నోటిలో నిమ్మరసం ఉన్నప్పుడు దంతాలు తోమవద్దు. నిమ్మరసం తాగిన తర్వాత సైతం బ్రష్ చేయకూడదు. అయితే నిమ్మరసం(Lemon Water Benefits) తాగడం వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి.


Also Read: Back Pain: వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల నడుము నొప్పి వస్తుందా, ఈ Health Tips పాటిస్తే సరి 


2. గుండెలో మంట..
నిమ్మరసం అధికంగా తాగితే గుండెలో నొప్పి, మంట పెరుగుతుంది. ముఖ్యంగా గుండె(Heart Problems) సంబంధిత సమస్య ఉన్న వారు నిమ్మరసం తక్కువగా సేవించాలి. పొట్టలో ఆమ్లత్వం పెరిగితే ఆహారం త్వరగ జీర్ణమై ఉదర సంబంధ సమస్యలు ఉత్పన్నమవుతాయి. తద్వారా గుండెల్లో మంటను కలిగిస్తుంది.


3. నోటి పూత..
సాధారణంగా నోటిలో కొందరికి సమస్యలు వస్తాయి. ఒంట్లో అధిక వేడి కారణంగా నోటిపూత వస్తుంది. నోటిలో పొక్కులు లాంటివి ఏర్పడతాయి. దీనిని మౌత్ అల్సర్ అని కూడా అంటారు. నిమ్మరసం అధికంగా సేవిస్తే కొందరికి నోటిపూత సమస్య తలెత్తుతుంది. దానివల్ల ఆ సమయంలో ఆహారం తినడం కూడా పెద్ద ఇబ్బందిగా మారుతుంది.


4. నిర్జలీకరణం(Dehydration)..
నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మూత్ర విసర్జనను పెంచే లక్షణాన్ని కలిగి ఉంది. అధికంగా నిమ్మరసం తాగితే ఇది శరీరంలో అదనపు ఉప్పును బయటకు పోయేలా చేస్తుంది. మీరు తరచుగా మూత్ర విసర్జన చేయడం ద్వారా  శరీరంలోని నీటి శాతం తగ్గిస్తుంది. తత్ఫలితంగా మీరు నిర్జలీకరణం(Dehydration) సమస్య బారిన పడతారు.


Also Read: Corona Vaccine: కరోనా విజేతలపై ఆసక్తికర విషయం, COVID-19 Vaccine ఒక్క డోసు ఇస్తే చాలు


5. మైగ్రేన్ సమస్య..
కొందరికి పార్శ్వ నొప్పి తీవ్ర ఇబ్బంది కలిగిస్తుంది. నిమ్మరసం లాంటి పదార్థాలు మైగ్రేన్ లాంటి నొప్పి(Migraine)కి కారణం అవుతాయి. పుల్లగా ఉండే నిమ్మరసం అధికంగా తాగితే మీరు తరచుగా మైగ్రేన్ సమస్య బారిన పడతారు. కనుక నిమ్మరసం సాధ్యమైనంత తక్కువగా సేవించాలి.


6. ఎముకలు బలహీనపడతాయి
నిమ్మరసంలో ఆమ్లత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలోని కాల్షియం మొత్తాన్ని తగ్గిస్తుంది. తద్వారా ఎముక బలహీనంగా మారుతుంది. చివరికి ఇది కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులకు, ఎముకల సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది.


Also Read: Health Tips: ప్రతిరోజు ఉదయాన్నే Hot Water తాగుతున్నారా, ఈ ప్రయోజనాలు తెలుసుకోండి


నిమ్మరసం ఎంత తాగాలి..
నిమ్మరసం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, కొంత నష్టం కూడా ఉంది. అందుకు నిర్ణీత మోతాదులో నిమ్మరసం సేవించాలి. 24 గంటల వ్యవధిలో కేవలం 2 నిమ్మకాలకు మించి ఎక్కువ తినరాదు. రెండు కన్నా ఎక్కువ నిమ్మకాయల రసాన్ని సైతం తాగకూడదని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook