Low Glycemic Index Fruits: గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ గల పండ్లు.. టైప్ -2 డయాబెటిస్ చాలా హెల్తీ!
పండ్లు చాలా ఆరోగ్యకమైనవే.. కానీ కొన్ని రకాల పండ్లు మధుమేహ వ్యాధి గ్రస్తులలో చక్కర స్థాయిలను పెంచుతాయి. కావున అన్ని రకాల పండ్లు మధుమేహులకు క్షేమం కావు.. ఇక్కడ తెలిపిన పండ్లు మధుమేహ వ్యాధి గ్రస్తులకు చాలా ఆరోగ్యకరం.
21 వ శతాబ్దపు కాలంలో వేగవంతమైన జీవన శైలి వలన అనేక ఆరోగ్య సమస్యలు కలుగుతున్నాయి. ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా మధుమేహం ఒక ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యగా మారింది. ఈ పరిస్థితిలో శరీరంలోని క్లోమ గ్రంథి గ్లూకోస్ స్థాయిని నిర్వహించే ఇన్సులిన్ ని ఉత్పత్తి చేయవు.. లేదా శరీరంలోని కణాలు ఇన్సులిన్ కి స్పందించవు. కానీ బ్లడ్ షుగర్ ని నియంత్రించడానికి కొన్ని విధానాలు ఉన్నాయి. సరైన మందులు మరియు జీవన శైలిని పాటించటం ద్వారా మధుమేహులు వారి వ్యాధిని తగ్గించుకోవచ్చు. కొన్ని రకాల పండ్లు తినటం ద్వారా మధుమేహ వ్యాధి స్థాయిని తగ్గిస్తాయి.
డయాబెటిస్ రోగులు తినవలసిన 5 పండ్లు
నారింజ..
నారింజ ఒక సిట్రస్ ఫ్రూట్. సిట్రస్ పండ్లు మధుమేహాం వ్యాధి గ్రస్తులకు ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యంగా నారింజ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ని కలిగి ఉంటుంది. ఇవి మధుమేహ రోగులకు ఉపయోగకరం. నారింజలో విటమిన్ C, ఫ్లేవనాయిడ్ యాంటీఆక్సిడెంట్లు మరియు ఫైబర్ కూడా ఎక్కువగా ఉన్నాయి.
నేరేడు పండ్లు..
మధుమేహ వ్యాధిగ్రస్తులకు నేరేడు పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇందులో విటమిన్ A, విటమిన్ C, విటమిన్ B మరియు విటమిన్ D వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి బ్లడ్ షుగర్ పెరిగే స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.
గ్రీన్ యాపిల్..
మధుమేహులకు గ్రీన్ యాపిల్ ఒక సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు. గ్రీన్ యాపిల్ లో కరిగే ఫైబర్, నియాసిన్, జింక్, ఐరన్ మరియు ఇతర మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ మూలకాలాన్ని రక్తంలో చక్కెరను నియంత్రించడంలో ఉపయోగపడతాయి. రెడ్ యాపిల్ లో చక్కర స్థాయిలు అధికంగా ఉంటాయి. వీటితో పోలిస్తే గ్రీన్ యాపిల్ లో చక్కర శాతం చాలా ఉంటుంది.
Also Read: iPhone 15 Sale: ఐఫోన్ 15 అమ్మకాలు షురూ.. ఎగబడి కొంటున్న జనం
జామ పండు..
జామ పండులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అంతేకాకుండా జామపండ్లలో సోడియం కూడా తక్కువగా ఉంటుంది. పొటాషియం ఎక్కువగా ఉంటుంది. మధుమేహ వ్యాధి గల వారికి పొటాషియం చాలా ముఖ్యం. నారింజతో పోలిస్తే జామపండులో నాలుగు రెట్లు ఎక్కువగా విటమిన్ C ఉంటుంది.
పియర్..
పియర్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది, కాబట్టి ఇది రక్తంలో చక్కెర స్థాయిని తొందరగా పెరగడాన్ని అనుమతించదు. ఇందులో విటమిన్ A, విటమిన్ C, విటమిన్ E, విటమిన్ B1 , విటమిన్ B2, విటమిన్ B3 మరియు విటమిన్ B9 పుష్కలంగా ఉన్నాయి. పియర్ లో పొటాషియం, కాల్షియం మరియు జింక్ కూడా పుష్కలంగా ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు కెరోటినాయిడ్స్ కూడా ఉంటాయి.
Also Read: మొటిమలు, మచ్చలను తగ్గించి.. యవ్వనంగా కనిపించేలా చేసే హోమ్ మేడ్ మిశ్రమం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook