Sperm Count: స్పెర్మ్ కౌంట్‌ను దెబ్బతీసే చెడు అలవాట్లు ఇవే..
Male Infertility Causes And Treatment: చాలామంది ఆరోగ్యంగా ఉన్నప్పటికీ వీర్యకణాల సంఖ్య ఒక్కసారిగా తగ్గిపోతుంది ఇలా తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ కింది కారణాలవల్లే చాలామందిలో వీర్యకణాల సమస్య వస్తోందని వారు అంటున్నారు.
Male Infertility Causes And Treatment: ఆధునిక జీవనశైలి కారణంగా వంధ్యత్వం సాధారణ సమస్యగా మారింది. ముఖ్యంగా పెళ్లయిన వారిలో ఈ సమస్య ఎంతగానో ప్రభావం చూపుతుంది. అయితే ఈ సమస్యతో బాధపడేవారు వైద్యులను సంప్రదించిన తర్వాత కొన్ని తప్పుడు అలవాట్లను మానుకోవడం లేదు.. దీని కారణంగా కూడా వీర్యకణాల సంఖ్య మరింత తగ్గుతోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే లైంగిక ఆరోగ్యం, వీర్యకణాల సంఖ్య పెంచుకోవాలనుకునేవారు తప్పకుండా వైద్య నిపుణులు సూచించిన ఈ అలవాట్లకు దూరంగా ఉండటం చాలా మంచిది. ముఖ్యంగా వివాహం చేసుకున్న పురుషులు తప్పకుండా ఆహారాలపై, జీవనశైలి పై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవే లైంగిక జీవితం పై ప్రత్యేక ప్రభావాన్ని చూపే అవకాశాలు ఉన్నాయి.
ప్రతిరోజు అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం కారణంగా చాలామందిలో వీర్యకణాల సంఖ్య తగ్గుతూ వస్తుంది. కాబట్టి తండ్రి కావాలనుకునే కోరిక నెరవేరాలంటే ఆరోగ్య నిపుణులు సూచించిన ఆహారాలను మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే లైంగిక జీవితం పై ప్రత్యేక ప్రభావం పడి అనేక సమస్యలు రావచ్చు.
సోయా ఆహారాలు..
స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా అనారోగ్య కారణాల్లో సోయా అధిక మోతాదులో లభించే ఆహారాలు తీసుకోవడమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇందులో అధిక పరిమాణంలో ఫైటోఈస్ట్రోజెన్లు ఉంటాయి. కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల వీర్యకణాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి.
సోడా డ్రింక్స్..
సోడా డ్రింక్స్ తాగడం వల్ల కూడా స్పెర్ము కౌంట్ తగ్గే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణంగా కొందరిలో డిఎన్ఎ కూడా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని వారు అంటున్నారు. తరచుగా పెళ్లయిన వారు కూల్ డ్రింక్స్ సోడా అధిక మోతాదులో కలిగిన పానీయాలను తాగకపోవడం చాలా మంచిది.
ప్యాక్ చేసిన ఆహారాలు..
ప్యాక్ చేసిన ఆహారాలు మన శరీరాన్ని దెబ్బతీయడమే కాకుండా హార్మోన్ సమస్యలకు దారి చూపే అవకాశాలున్నాయి.. దీంతో పాటు కొంతమందిలో టెస్టోస్టెరాన్ హార్మోన్ పై కూడా ప్రభావం చూపవచ్చు కాబట్టి తరచుగా ప్యాకేజీ చేసిన ఆహారాలు తీసుకోవడం కారణంగా వీర్యకణాల సంఖ్య తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ధూమపానం చేయడం..
చాలామంది యువత ధూమపానం చేస్తున్నారు ఇది ఆధునిక జీవనశైలిలో ఒక భాగం అయిపోయింది. అయితే ఎక్కువగా ధూమపానం చేయడం కారణంగా కూడా స్పెర్ము కౌంట్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తరచుగా ధూమపానం చేయడం మానుకుంటేనే పిల్లలు పుట్టే అవకాశాలు ఉన్నాయి.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. వీటిని అనుసరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా పొందండి. దీనికి ZEE TELUGU NEWS బాధ్యత వహించదు.)
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి