How To Take Mango Leaves For Diabetes: మధుమేహం, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం ప్రమాదకరంగా మారుతోంది. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే చెడు కొలెస్ట్రాల్‌ పెరగడం కారణంగా గుండెపోటు వంటి సమస్యలు వచ్చే ఛాన్స్‌లున్నాయి. భారత్‌ వ్యాప్తంగా మధుమేహం వ్యాధిగ్రస్తుల సంఖ్య దాదాపు 80 మిలియన్లకు చేరుకుంది. కాబట్టి ఇలాంటి రెండు అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా శరీరపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా వైద్యులను సంప్రదించి పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన పలు చిట్కాలు పాటించడం వల్ల కూడా సులభంగా ఈ రెండు సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మధుమేహం, ఉబ్బసం వంటి సమస్యలతో బాధపడేవారు ఆయుర్వేద నిపుణులు సూచించి మామిడి ఆకుల రసాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఆకులలో పోషకాలు పుష్కలంగా ఉండటమే..గ్లూకోజ్‌ స్థాయిలు కూడా తక్కువ పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి తీవ్ర మధుమేహంతో బాధపడేవారు ప్రతి రోజూ మమిడి ఆకులతో తయారు చేసిన రసాన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.


మామిడి ఆకుల ప్రయోజనాలు:
మామిడి పండ్లు తినడానికి చాలా రుచిగా ఉన్నా అనారోగ్య సమస్యలను తగ్గించడానికి ప్రభావవంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. అయితే ఈ ఆకుల రసంలో ఇన్సులిన్ ఉత్పత్తిలో మార్పులు తీసుకువచ్చే చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి సులభంగా రక్తంలో చక్కెర పరిమాణాలను సులభంగా నియంత్రించడానికి సహాయపడుతుంది.


పోషకాలు పుష్కలంగా ఉంటాయి:
మామిడి ఆకులలో పెక్టిన్, ఫైబర్, విటమిన్ సి వంటి అనేక పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇది మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ ఆకులు మధుమేహం లక్షణాలను తొలగించడానికి కూడా ఉపయోగపడతాయి. రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జన, అస్పష్టమైన దృష్టి, అధిక బరువు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగించేందుకు సహాయపడుతుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.. కాబట్టి తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.


మామిడి ఆకుల రసం తయారి విధానం:
మామిడి ఆకుల రసం తయారు చేయడానికి..15 తాజా మామిడి ఆకులను 100 నుంచి 150 ml నీటిలో మరిగించాలి. ఇప్పుడు ఈ నీటిని రాత్రంతా అలాగే ఉంచి అల్పాహారానికి ముందు త్రాగాలి. ఇలా మూడు నెలల పాటు క్రమం తప్పకుండా చేయడం వల్ల మధుమేహం నుంచి అధిక కొలెస్ట్రాల్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.


Also Read: Ind Vs Aus: సేఫ్ జోన్‌లో ఆసీస్.. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు.. భారత్ గెలవాలంటే..!  


Also Read: MP Avinash Reddy: వైఎస్ వివేకా హత్య కేసులో సంచలన విషయాలు.. మొత్తం బయటపెట్టిన అవినాష్ రెడ్డి 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి