Marigold benefits: బంతి పువ్వుతో కలిగే ప్రయోజనాలు తెలిస్తే..మీరు ఆశ్చర్యపోతారు..!!
Marigold benefits: అందమైన మెరిసే చర్మాన్ని పొందడానికి చాలా ప్రొడక్ట్ మార్కెట్‌లో ఉన్నాయి. అయితే ఇవి అశించిన ఫలితాలను ఇవ్వకపోవాడంతో అందరు ఇంటి నివారణలపై అధిక అసక్తి చూపుతున్నారు. అయితే మెరిసే చర్మాన్ని పొందడానికి టెర్రస్, బాల్కనీలలో పెరిగే బంతిపూలు కూడా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయని చాలా మంది తెలియదు
Marigold benefits: అందమైన మెరిసే చర్మాన్ని పొందడానికి చాలా ప్రొడక్ట్ మార్కెట్‌లో ఉన్నాయి. అయితే ఇవి అశించిన ఫలితాలను ఇవ్వకపోవాడంతో అందరు ఇంటి నివారణలపై అధిక అసక్తి చూపుతున్నారు. అయితే మెరిసే చర్మాన్ని పొందడానికి టెర్రస్, బాల్కనీలలో పెరిగే బంతిపూలు కూడా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయని చాలా మంది తెలియదు. బంతి పూలను ఉపయోగించి అందమైన చర్మాన్ని ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బంతి పువ్వును చర్మానికే కాకుండా.. జుట్టుకు కూడా ఉపయోగించవచ్చు. ఇలాంటి గుణాలున్న బంతి ప్రత్యేకతను తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఫంగల్ లక్షణాలు చర్మాన్ని బిగుతుగా ఉంచడంతో పాటు గ్లో మెయింటైన్ చేయడంలో బంతి ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. వేసవి కాలంలో వచ్చే దద్దుర్లు, వడదెబ్బ సమస్యలను బంతి పువ్వులతో అధిగమించవచ్చు. ముఖంపై మొటిమలు, మచ్చల సమస్య ఉన్నవారు బంతి పువ్వు యొక్క ఫేస్ ప్యాక్‌ని ఉపయోగించవచ్చు.
బంతిపువ్వు ఎలా ఉపయోగించాలి?:
పైన పేర్కొన్న పేరాల్లో బంతి పువ్వు ప్రయోజనాలు తెలుసుకున్నారు. ఇప్పుడు పువ్వును ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం..ఇది స్కిన్ టోన్ పెంచేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిని పేస్ట్‌లా చేసి ఫేస్ ప్యాక్, హెయిర్ మాస్క్‌లుగా కూడా ఉపయోగించవచ్చు.
ఈ పువ్వుతో మొటిమలకు గుడ్ బై చెప్పండి:
ముఖ్యంగా వేసవిలో మొటిమల సమస్య పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో 3-4 బంతి పువ్వులను తీసుకుని.. బాగా శుభ్రం చేసి దానిని పేస్ట్ చేయండి. ఈ పేస్ట్‌లో కొద్దిగా పెరుగును కలిపి ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచండి. కడిగే ముందు చల్లటి నీళ్లను ముఖంపై చిలకరించి వేళ్లతో బుగ్గలపై మసాజ్ చేయండి. ముఖంపై మొటిమలు ఎక్కువగా ఉంటే.. వారానికి రెండుసార్లు ఈ రెసిపీని ఉపయోగించండి.
బంతి పువ్వుతో తయారు చేసిన టోనర్:
5-6 బంతి పువ్వులను శుభ్రం చేసి ఒకటి నుంచి ఒకటిన్నర కప్పుల నీటిలో వేసి మరిగించాలి. నీరు బాగా మరిగిన తర్వాత దానిని వడపోసి చల్లబరచండి. అందులో 2 టీస్పూన్ల అలోవెరా జెల్‌ను కూడా వేయండి. ఈ రెండింటినీ బాగా మిక్స్ చేసి స్ప్రే బాటిల్‌లో నింపి రాత్రి పూట వినియోగించండి.
మేరిగోల్డ్, రైస్ స్క్రబ్:
టోనర్, ఫేస్ ప్యాక్ కాకుండా బియ్యం పిండిలో బంతి పువ్వుల పేస్ట్‌ను కలిపి స్క్రబ్‌గా కూడా ఉపయోగించవచ్చు. వేసవిలో పొడి చర్మం సమస్యలతో బాధపడుతున్నవారు ఈ స్క్రబ్‌తో ఉపశమనం పొందవచ్చు.
పొడి జుట్టు కోసం:
బంతిపువ్వు చర్మానికే కాదు జుట్టుకు కూడా మంచి ప్రయోజనాన్ని ఇస్తుంది. ఈ పువ్వులో ఉండే పోషక గుణాలు జుట్టు రాలడం, మెరుపు కోల్పోవడం వంటి సమస్యలను దూరం చేస్తుంది.
Also Read: Apple Peel Benefits: యాపిల్‌ను తొక్క తీసి తింటున్నారా..అయితే అలా తినకండి..!!
Also Read: Weight Loss Mistakes: రోజూ ఇలా వ్యాయమం చేసిన బరువు తగ్గడం లేదా..అయితే ఈ పని చేయండి..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి