Mind Detox Signs: ఆరోగ్యకరమైన జీవన విధానం, మంచి ఆహారపు అలవాట్లు మనిషి ఆరోగ్యాన్ని నిలబెడతాయి. ఈ రెండింటిలో ఏది తేడా అయినా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంటుంది. అదే విధంగా మానసిక ఆరోగ్యం కూడా. మెదడులో వ్యర్ధాలు చేరకుండా చూసుకోవాలి. లేదా శరీరంలోని కొన్ని భాగాల్ని డీటాక్స్ చేసినట్టే బ్రెయిన్ కూడా డీటాక్స్ చేస్తుండాలి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆధునిక బిజీ ప్రపంచంలో ప్రతి వ్యక్తికి సాధారణ ఆరోగ్య సమస్యలతో పాటు మానసిక ఆరోగ్య సమస్యలు కూడా వెంటాడుతున్నాయి. ముఖ్యంగా ఒత్తిడి, ఆందోళన వేధిస్తుంటాయి. పని ఒత్తిడి కావచ్చు, ఇంట్లో బాధ్యతలు కావచ్చు, వ్యక్తిగత సమస్యలు కావచ్చు లేదా చెడు ఆహారపు అలవాట్లు, చెడు అలవాట్లు కావచ్చు అన్నీ కలిపి మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తుంటాయి. మానసిక ఆరోగ్యం క్షీణిస్తుంటే గుర్తించడం అంత సులభం కాదు. కానీ తరచూ విచారంగా ఉండటం, అలవాట్లు మారుతుండటం గమనిస్తే తక్షణం వైద్యుని సంప్రదించడం మంచిది. ఎందుకంటే ఇది మానసిక అనారోగ్యానికి సంకేతం. బ్రెయిన్ డీటాక్స్ చేయాల్సి ఉంటుంది. మెంటల్ డీటాక్స్ లేదా బ్రెయిన్ డీటాక్స్ అంటే మస్తిష్కంలో నెగెటివ్ ఆలోచనలు, కల్పనలు లేకుండా చేయడమే. ఇలా చేయడం వల్ల ఆ మనిషి ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం పొందవచ్చు.


మెంటల్ డీటాక్స్ ఎప్పుడు అవసరమౌతుంది


తరచూ నెగెటివ్ ఆలోచనలు వస్తున్నప్పుడు, ఆలోచనలు, బావనల్ని నియంత్రించలేనప్పుడు, జనంతో మమేకం అవలేక ఇబ్బందులు ఎదుర్కోవడం, ఆత్మ విశ్వాసం తగ్గడం, తరచూ అలసటగా ఉండటం, మూడ్ స్వింగ్ వంటి పరిస్థితులున్నప్పుడు మెంటల్ డీటాక్స్ అవసరమౌతుంది.


బయట ప్రశాంత వాతావరణంలో తిరగడం, యోగా చేయడం, ధ్యానం చేయడం వంటి ప్రక్రియల ద్వారా మనో శాంతి కలుగుతుంది. నెగెటివ్ ఆలోచనలు దూరమౌతాయి. అందరికీ ఏదో ఒక అలవాటు ఉంటుంది. చెడు ఆలోచనలు వస్తున్నప్పుడు తమకిష్టమైన హాబీపై దృష్టి పెట్టడం ద్వారా రిఫ్రెష్ అవచ్చు. తినే ఆహారం కూడా ఆరోగ్యకరమైందిగా ఉండాలి. శారీరకంగా కూడా ఫిట్ అండ్ హెల్తీగా ఉండాలి. మానసిక సమస్యల్నించి తప్పిచుకునేందుకు ఇది చాలా అవసరం. రోజూ తగినంత నిద్ర కూడా ఉండాలి. రోజుకు 7-9 గంటలు తప్పకుండా నిద్రపోవాలి. తద్వారా మస్తిష్కం పనితీరు బాగుంటుంది. 


Also read: Anxiety Reduction Foods: ఈ ఆహారం తీసుకోండి.. ఒత్తిడి నుండి బయటపడటం ఖాయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook