పుదీనా వల్ల బోలెడు ప్రయోజనాలు..
పుదీనా వల్ల బోలెడు ప్రయోజనాలు..
పుదీనాలో అనేక ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. దీని ఆకులు సంవత్సరం పొడవునా ఆకుపచ్చగా ఉంటాయి. పుదీనా మొక్క ప్రతి భాగం ఉపయోగపడేదే.. ఔషధతత్వాలు కలిగిఉన్నదే..!
పుదీనాలో ఉండే ఔషధ గుణాలు అలర్జీని, ఉబ్బసాన్ని దూరంచేస్తుందని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అందుకే వంటల్లో పుదీనాను వాడుతూ ఉండాలని చెబుతున్నారు. తరచూ కూర లేదా పచ్చళ్ల రూపంలో పుదీనా ఆకులను తీసుకుంటే ఫలితం కనిపిస్తుందట. పుదీనా తీసుకోవడం వల్ల బోలెడు ప్రయోజనాలున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..!
- పుదీనాలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి అలర్జీని దూరం చేస్తాయి.
- శ్వాస సంబంధిత సమస్యలను పుదీనా దరిచేరనివ్వదు.
- వంటల్లో తరచూ పుదీనాని చేర్చుకోవడం వల్ల నోటిలోని హానికర బాక్టీరియాలను నశింపజేయవచ్చు.
- వర్షాకాలం, శీతాకాలంలో పుదీనా ఆకుల నూనె వేసి ఆవిరి పట్టినట్లయితే జలుబు, గొంతునొప్పిల నుండి ఉపశమనం పొందవచ్చు.
- పుదీనా ఉండే విటమిన్ సి, డీ, ఇ, బి లు.. కాల్షియం, పాస్పరస్ మూలకాల వల్ల రోగనిరోధక శక్తి పెరిగి.. అనారోగ్యాలను దూరం చేస్తాయి.
- పుదీనా ఆకులతో టీని తయారుచేసుకుని ప్రతిరోజూ తీసుకుంటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.
- చర్మం దురదలుగా ఉన్నప్పుడు ఈ పుదీనా ఆకులను నలిపి ఆ ప్రాంతాల్లో రాసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది.
- పుదీనా ఆకులతో కాచిన కషాయంలో కొద్దిగా ఉప్పు కలుపుకుని నోటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి సమస్య తగ్గుతుంది.