Weight Loss Tips: ఉదయం పూట ప్రతి రోజు వాకింగ్ చేస్తే..బరువు తగ్గడమేకాకుండా..గుండె జబ్బులకు చెక్..
Morning Walk For Weight Loss: ఉదయం పూట వ్యాయామాలతో పాటు వాకింగ్ చేస్తే సులభంగా గుండె సమస్యలతో పాటు బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా వాకింగ్ చేయాల్సి ఉంటుంది.
Morning Walk For Weight Loss: ఉదయం పూట వాకింగ్ చేయడం చాలా మంచిదని తరచుగా ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రతిరోజూ దాదాపు 5000 అడుగులు నడిస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఆరోగ్యంపై అవగాహన ఉన్నవారు తరచుగా ఉదయాన్నే నిద్రలేచి నడవడానికి ఇష్టపడతారు. కానీ బిజీ లైఫ్ స్టైల్ వల్ల చాలా మంది నడవడానికి ఇష్టపడడం లేదు. అంతేకాకుండా చాలా మంది నడవడానికి బదులుగా బైక్ లేదా కారులో ప్రయణాలు చేస్తున్నారు. దీంతో వీరు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా నడవాల్సి ఉంటుంది.
వాకింగ్ వల్ల వచ్చే లాభాలు ఇవే:
1. స్టామినా పెరుగుతుంది:
ప్రతి రోజూ అరగంట పాటు మార్నింగ్ వాక్ చేస్తే..ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచేందుకు కృషి చేస్తుంది. అంతేకాకుండా ఆక్సిజన్‌ను ఎక్కువగా తీసుకోవడం ప్రారంభిస్తారు. ఇలా క్రమం తప్పకుండా ప్రతి రోజూ వాకింగ్ చేస్తే శ్వాసక్రియలో మార్పులు వస్తాయి. దీంతో అనారోగ్య సమస్యల కూడా తగ్గుతాయి. శరీర బరువుతో బాధపడుతున్నవారు అస్సలు భారీ వ్యాయామాలు చేయకూడదని నిపుణులు తెలుపుతున్నారు.
2. శరీర బరువును నియంత్రిస్తుంది:
ప్రస్తుతం చాలా మంది ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి శారీరక శ్రమను తగ్గించి ఉదయం పూట వాకింగ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ప్రతి రోజు ఉదయం పూట వాకింగ్‌తో పాటు వ్యాయామాలు చేయడం వల్ల పొట్ట సమస్యలే కాకుండా.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. ముఖ్యంగా మధుమేహం, బరువు తగ్గడం సమస్యలు సులభంగా దూరమవుతాయి.
3. గుండె జబ్బులకు చెక్:
క్రమం తప్పకుండా మార్నింగ్ వాక్ చేసే వ్యక్తులు, కొరోనరీ ఆర్టరీ వ్యాధి, ట్రిపుల్ నాళాల వ్యాధి, గుండెపోటు, గుండె ఆగిపోయే ప్రమాదం చాలా వరకు తగ్గుతాయి. ఎందుకంటే ప్రతి రోజూ వ్యాయామాలతో పాటు, వాకింగ్ చేస్తే ఇది రక్తంలో నిల్వ ఉన్న కొవ్వును తగ్గిస్తుంది. కాబట్టి మధుమేహం, చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ వాకింగ్ చేయాల్సి ఉంటుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: India Vs Bangladesh Preview: లైట్ తీసుకుంటే షాక్ తప్పదు.. బంగ్లాకు చుక్కలు చూపియాల్సిందే..!
Also Read: Betel leaves Benefits: ఆ ఆకులతో అల్సర్, మధుమేహం, మలబద్ధకం సమస్యకు చెక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి