Mosquito Coil Side Effects In Telugu: వర్షాకాలంలో దోమల వ్యాప్తి వేగవంతమవుతుంది. ఈ సమయంలోనే దోమల సంతానోత్పత్తి దశ చివరికి చేరుకుని చిన్న చిన్న దోమలు పుట్టుకొస్తాయి. దీని కారణంగానే డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా జ్వరాలు రావడం ప్రారంభమవుతాయి. ఈ వానకాలం చివరి నెలల్లో తప్పకుండా వీటి దోమల బెడద బారిన పడకుండా ఉండాలి. అయితే వీటి బెడద నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది మార్కెట్‌లో లభించే రసాయనాలతో కూడిన కాయిల్ వినియోగిస్తున్నారు. ఇంతకీ వీటిని వాడడం మంచిదేనా? తరచుగా వినియోగించడం వల్ల ఏవైనా దుష్ప్రభావాలు కలుగొచ్చా?. అనే ప్రశ్నలకు సమాధానాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మార్కెట్‌లో లభించే దోమల కాయిల్స్ కాల్చడం వల్ల శరీరానికి చాలా రకాల అనారోగ్య సమస్యలు రావచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని నుంచే వచ్చే పొగ దోమలను చంపడమే కాకుండా అనేక మనుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశాలు ఉన్నాయి. మస్కిటో కాయిల్ నుంచి వచ్చే పొగ  సిగరెట్ల పొగ కంటే హానికరమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ కాయిల్‌లో చాలా రకాల హానికరమైన రసాయనాలు లభిస్తాయి. దీనిని తరచుగా పీల్చుకోవడం వల్ల ఊపిరితిత్తులు దెబ్బ తినే అవకాశాలు కూడా ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొంతమందిలో దీని కారణంగా శ్వాస సంబంధిత సమస్యలు కూడా వస్తున్నాయి. అంతేకాకుండా ఆస్తమా, చర్మ అలెర్జీ  వంటి అనేక రకాల అనారోగ్య సమస్యలు రావచ్చని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. 


ఇది కూడా చదవండి : Cats Vs Snakes Fighting Videos: పిల్లులకు, పాములకు ఫైటింగ్ జరిగితే ఏది గెలుస్తుంది ?


ఆ దోమల కాయిల్స్ వెలుబడే పొగ మెదడును కూడా ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా తీవ్ర మెదడు సమస్యలు వచ్చే ఛాన్స్‌లు కూడా ఉన్నాయని రోగ్య నిపుణులు చెబుతున్నారు. మస్కిటో కాయిల్స్ తరచుగా కాల్చడం వల్ల మీ చుట్టూ ఉన్న పర్యావరణంలో మార్పులు కూడా రావచ్చు. విషపూరిత పొగ గాలిని కలుషితం చేసి జంతువులకు కూడా హాని కలిగించే ఛాన్స్‌లు కూడా ఉన్నాయిని పరిశోధకులు చెబుతున్నారు. దీనిని వినియోగించిన పొగ నీటిలో కలవడం వల్ల నీరు కూడా కలుషితమవుతుంది. 


దోమల బెడద సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి  కాయిల్స్‌కు బదులుగా సురక్షితమైన ప్రోడక్ట్స్‌ వినియోగించడం చాలా మంచింది. అంతేకాకుండా మార్కెట్‌లో లభించే ఎలక్ట్రిక్ రిపెల్లెంట్‌లు, యంత్రాలను వినియోగించడం వల్ల కూడా వీటి బెడద నుంచి పర్యావరణానికి హాని కలగకుండా ఉపశమనం పొందవచ్చు. వీటికి బదులుగా నిద్రపోయే ముందు దోమతెరను వినియోగించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే తరచుగా దోమల బెడద సమస్యలతో బాధపడేవారు ఇంటిని ప్రతి రోజు శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. 
 
(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


ఇది కూడా చదవండి : Cats Vs Snakes Fighting Videos: పిల్లులకు, పాములకు ఫైటింగ్ జరిగితే ఏది గెలుస్తుంది ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి