భారతీయ నగరాల్లో అధిక శాతం ప్రజలు పని ఒత్తిడితో, మానసిక సమస్యలతో ఆందోళన చెందుతున్నారని అధ్యయనం ద్వారా  తెలిసింది. ప్రధాన నగరాల్లో 60 శాతం మంది ఉద్యోగులు పని ఒత్తిడికి లోనవుతున్నారని ఆన్లైన్ డాక్టర్ల కన్సల్టెంట్ ఫోరమ్, లీబ్రేట్ చెప్పింది. పని ఒత్తిడి సమస్యలతో ఆందోళన చెందుతున్న నగరాల్లో వాణిజ్య నగరం ముంబై (31 శాతం) మొదటి స్థానంలో ఉంది.  ఆ తరువాత వరుసగా దిల్లీ (27 శాతం), బెంగళూరు (14 శాతం), హైదరాబాద్ (11 శాతం), చెన్నై (10 శాతం ), కోల్కతా (7 శాతం)  నగరాలు ఉన్నాయి. అధిక సమయం పనిగంటలు, లక్ష్యాలను గడువులోపు  పూర్తిచేయకపోవడం, పోటీతత్వం పెరిగిపోవడం, కుటుంబం- ఉద్యోగానికి మధ్య సమన్యయం కుదరకపోవడం, యాజమాన్యం ఒత్తిడి .. ఇవన్నీ మానసిక ఆందోళనలకు, తీవ్ర ఒత్తిడికి గురిచేసే అంశాలుగా పరిగణలోకి తీసుకొని అధ్యయనం చేశారు. 


మీడియా అండ్ పబ్లిక్ రిలేషషిప్ (22 శాతం), బీపీఓ (17 శాతం), ట్రావెల్ అండ్ టూరిజం (9 శాతం), అడ్వటైజింగ్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ (8 శాతం) రంగాల్లో పని ఒత్తిడి ఉంది. అధికంగా సేల్స్ అండ్ మార్కెటింగ్ రంగంలో 24 శాతం పని ఒత్తిడి ఉందని లిబ్రేట్ నొక్కిచెప్పింది. 10 అక్టోబర్, 2016 నుండి 12 నెలల వరకు వైద్యుల సహకారంతో లిబ్రేట్ జరిపిన అధ్యయనాల ద్వారా ఈ విషయాలను విశ్లేషించారు.