Covid 19 Strange Symptoms: కరోనా మహమ్మారికి సంబంధించి కొన్ని లక్షణాల గురించి ఇప్పటికీ చాలామందికి తెలియదు. అసలు కోవిడ్ లక్షణాలకు, ఫ్లూకు తేడా పసిగట్టలేరు. కరోనా వైరస్‌కు చెందిన కొన్ని విచిత్ర లక్షణాల గురించి తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా వైరస్ మహమ్మారి వెలుగు చూసిన రెండేళ్ల తరువాత కూడా కోవిడ్ కేసులు వేలాదిగా నమోదవుతున్నాయి. మహమ్మారికి సంబంధించి కొత్త వేరియంట్లు వచ్చే కొద్దీ కోవిడ్ లక్షణాల్లో కూడా మార్పు వస్తోంది. ప్రారంభంలో బ్రిటన్ ఆరోగ్య శాఖ అయితే జ్వరం, దగ్గు, రుచి, వాసన పోవడమనేది ముఖ్య లక్షణాలుగా వెల్లడించింది. ఇప్పుడు కొత్త లక్షణాల గురించి తెలిపింది. గొంతులో వాపు, ముక్కు దిబ్బడ, ముక్కు కారడం, తలనొప్పి వంటి లక్షణాల గురించి వెల్లడించింది. చర్మంపై గాయం, వినికిడి శక్తి తగ్గడం వంటి లక్షణాలు పెరిగే కొద్దీ కోవిడ్ లక్షణాలపై మరింత లోతుగా పరిశీలన జరపాల్సిన అవసరం ఏర్పడుతోంది. 


చర్మంపై గాయం


కోవిడ్ 19 లక్షణాల్లో కొత్తగా వెలుగు చూస్తున్న లక్షణమిది. బ్రిటన్ 2021లో ప్రచురించిన ఓ అధ్యయనంలో 5మంది రోగుల్లో కేవలం ఒకరికి చర్మంపై గాయాలు కన్పించాయి. ఇది తప్ప మరే లక్షణం అతనిలో కన్పించలేదు. కరోనా వైరస్‌కు ఉండే ఇతర లక్షణాల కారణంగా చర్మంపై ప్రభావం పడవచ్చు. కొంతమందికి చర్మంపై మచ్చలు లేదా గాయం ఉండే పరిస్థితి ఉంది. ఇంకొంతమందికైతై చర్మంలో మంట లేదా రెండూ కన్పించాయంటున్నారు. చర్మానికి సంబంధించి కోవిడ్ లక్షణాలు ఏ విధమైన చికిత్స లేకుండానే కొన్ని రోజుల తరువాత తగ్గిపోతున్నాయి. ఒకవేళ చర్మం మరీ ఎక్కువగా మండటం లేదా నొప్పిగా ఉంటే డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. 


కోవిడ్ గోర్లు


సార్స్ సీవోవి 2 సహా చాలా రకాల వ్యాధులు సంక్రమించినప్పుడు శరీరంలో సహజసిద్దంగా ఎంతటి ఒత్తిడిలో ఉందో చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఎన్నో రకాల లక్షణాల ద్వారా బయటకు చెప్పేందుకు మన శరీరం ప్రయత్నిస్తుందని వైద్యులు చెబుతారు. గోర్లలో వచ్చే మార్పులు కూడా ఇందులో భాగమని చెబుతారు. శరీరంపై ఒత్తిడి పడినప్పుడు గోర్ల పెంపుదలలో ఆకస్మిక నియంత్రణ కన్పిస్తుంది. గోర్లపై అడ్డగీతలు ఏర్పడతాయి. గోర్ల కింది చర్మంలో ప్రోటీన్ల అసహజ ఉత్పత్తి కారణంగా గోర్లపై తెల్లటి గీతలు కన్పిస్తాయి. 


జుట్టు రాలడం


జుట్టు రాలడం బహుశా కోవిడ్‌కు సంబంధించి ఓ స్వల్ప లక్షణం కావచ్చు. ఈ లక్షణం కోవిడ్ వచ్చిన నెల తరువాత కూడా ఉంటుంది. కోవిడ్ బాధితులైన 6 వేలమందిని పరశీలించినప్పుడు దాదాపు 48 శాతం మందికి కరోనా వచ్చిన తరువాత జుట్టు రాలడం ప్రారంభమైంది. 


వినికిడి శక్తి తగ్గడం


కోవిడ్ మహమ్మారి శరీరంలోని అంతర్గత సెన్సిటివ్ భాగాలపై ప్రభావం చూపిస్తోంది. ఫలితంగా చాలామందిలో వినికిడి శక్తి తగ్గిపోయింది. వినికిడి శక్తి తగ్గడం లేదా చెవిలో కంటిన్యూగా సౌండ్ వస్తున్నట్టు ఉండటం ప్రధానంగా కన్పించింది. దాదాపు 560మందిని అధ్యయనం చేసినప్పుడు 3.1 శాతం కోవిడ్ రోగుల్లో వినికిడి శక్తి తగ్గిపోయింది.


Also read: Sandalwood Benefits: చందనం పేస్ట్‌ వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకోండి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook