Watermelon: వేసవి మండిపోతోంది. రోజురోజుకీ ఎండల తీవ్రత పెరుగుతోంది. వేసవిలో ఆరోగ్యాన్ని సంరక్షించుకునేందుకు వివిధ రకాల పండ్లు, ద్రవ పదార్ధాలు అవసరమౌతుంటాయి. ఈ క్రమంలో పుచ్చకాయతో కలిగే ప్రయోజనాలు పరిశీలిద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పుచ్చకాయ అనేది కేవలం డీ హైడ్రేషన్ రాకుండా చేయడమే కాకుండా..మనిషికి అవసరమైన శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లను, విటమిన్లను అందిస్తుంది. అందుకే పుచ్చకాయ వేసవిలో అద్భుతమైన ఫ్రూట్ అంటున్నారు న్యూట్రిషనిస్టులు. ఎందుకంటే వేసవిలో ఎండల తీవ్రత పెరిగే కొద్దీ ఆకలి తగ్గడం, బాడీలో నీటి శాతం తగ్గిపోవడం వంటివి తలెత్తుతుంటాయి.


పుచ్చకాయకు ఉండే రిఫ్రెషింగ్, స్వీట్ టేస్ట్ కారణంగా ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ప్రపంచవ్యాప్తంగా పుచ్చకాయ అందరికీ తెలిసిందే. ఈజిప్టులో 5 వేల ఏళ్ల క్రితమే పుచ్చకాయను పండించారు. సహజసిద్దమైన యాంటీ ఆక్సిడెంట్లకు పుచ్చకాయ ప్రసిద్ధి. ఇందులో లైకోపీన్, ఆస్కార్బిక్ యాసిడ్, సిట్రిలిన్ పుష్కలంగా ఉంటాయి. వీటివల్ల గుండెపోటు, కేన్సర్ వంటి క్రానిక్ వ్యాధుల్నించి కూడా రక్షించుకోవచ్చు.


ఎండలు పెరిగేకొద్దీ..చాలామందికి ఆకలి తగ్గిపోతుంటుంది. అలసట ఎక్కువౌతుంది. డీ హైడ్రేషన్‌కు గురవుతుంటారు. మీకు కూడా అటువంటి సమస్యలు ఎదురైతే..పుచ్చకాయ అద్భుతంగా పనిచేస్తుంది. పుచ్చకాయలో 90-92 శాతం నీరుండి..విస్తృతమైన న్యూటియంట్లు ఉంటాయి. పుచ్చకాయ లో కేలరీ ఫ్రూట్ కాబట్టి..బరువు పెరుగుతారనే ఆందోళన అవసరం లేదు. ఇక సోడియం కూడా తక్కువే ఇందులో. 


పుచ్చకాయలో విటమిన్ ఏ, విటమిన్ సి, బీ6, పొటాషియం, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు లైకోపీన్, బీటా కెరోటిన్ ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు సెల్ డ్యామేజ్ కాకుండా రక్షిస్తాయి. కేన్సర్‌ను కూడా నిరోధిస్తుందని వైద్యులు చెబుతారు. పుచ్చకాయలో అధికంగా ఉండే నీరు, విటమిన్ బి6, విటమిన్ సి కారణంగా కొలాజెన్ ఉత్పత్తి పెరిగి..చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో ఉండే లైకోపీన్ అనేది సన్ ప్రొటెక్టర్‌గా పనిచేస్తుంది. ఇక విటమిన్ ఏ అనేది మీ కంటి ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. 


పుచ్చకాయను ఎలా తీసుకున్నా ఫరవాలేదు. నేరుగా తినవచ్చు లేదా జూస్ చేసుకుని తాగవచ్చు. లేదా ఇతర పండ్లు కీరా, మామిడి, కేరట్, ఆరెంజ్‌తో కలిపి కూడా తీసుకోవచ్చు.


Also read: Summer Health: వేసవిలో మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే ఆరు అద్భుతమైన పద్ధతులు ఇవే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook