Nail Biting: గోర్లు కొరికే అలవాటుందా..ఈ ప్రమాదకర వ్యాధులు రావచ్చు జాగ్రత్త
Nail Biting: చాలామందికి గోర్లు కొరికే అలవాటుంటుంది. ఈ అలవాటు ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తుంది. గోర్లు కొరకడం వల్ల ఇన్‌ఫెక్షన్ సోకి..పలు సమస్యలకు కారణమౌతుంది.
చిన్న పిల్లల్నించి పెద్దోళ్ల వరకూ చాలామందిలో కన్పించే లక్షణం గోర్లు కొరకడం. అదే పనిగా వేళ్లు నోట్లో పెట్టుకుని గోర్లు కొరుకుతుంటారు. ఇది చూడ్డానికి సాధారణ లక్షణంలా కన్పించినా..ఆరోగ్యానికి తీవ్ర నష్టం కల్గిస్తుంది. గోర్లు కొరికే సమస్య ఉంటే..ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఆ సమస్యలేంటో చూద్దాం..
ఫంగల్ ఇన్‌ఫెక్షన్
గోర్లను మనం ఎంత శుభ్రంగా ఉంచుకోవాలని ప్రయత్నించినా కన్పించని వ్యర్ధం, మట్టి చాలా ఉంటుంది. అందుకే గోర్లు కొరకడం వల్ల ఇందులో ఉండే బ్యాక్టీరియా నోట్లోకి..కడుపులోకి చేరుతుంటాయి. ఫలితంగా ఇన్‌ఫెక్షన్ తలెత్తుతుంది. ఈ ఇన్‌ఫెక్షన్ వ్యాధులకు కారణం కావచ్చు.
జీర్ణక్రియపై దుష్ప్రభావం
గోర్లు కొరికే అలవాటుంటే..బ్యాక్టీరియా నోట్లోకే కాదు..కడుపులోకి చూడా చేరిపోతుంది. ప్రమాదకర బ్యాక్యీరియా మీ జీర్ణక్రియను దెబ్బతీస్తుంది. గోర్లు కొరకడం వల్ల జీర్ణక్రియ సంబంధిత సమస్యలు ఉత్పన్నమౌతాయి.
పళ్లకు హాని
గోర్లు కొరకడం వల్ల పళ్లకు హాని కలుగుతుంది. గోర్లు చాలా గట్టిగా ఉంటాయి. వీటిని కొరకడం వల్ల పళ్లు దెబ్బతింటాయి. పళ్ల ఆకారం కూడా పాడయ్యే అవకాశముంది. చిగుళ్లపై కూడా చెడు ప్రభావం పడవచ్చు. గోర్లను అదే పనిగా కొరుకుతుంటే..వేళ్లు కూడా దెబ్బతింటాయి. ఇది ఏ మాత్రం మంచి అలవాటు కాదు. ఆరోగ్యపరంగానే కాకుండా..నలుగురిలో చూసేందుకు సౌకర్యంగా ఉండదు.
సెప్టిక్ ఆర్థరైటిస్
గోర్లు నమలడం వల్ల శరీరంలో పైరోనీషియా వంటి బ్యాక్టీరియా ప్రవేశించే ప్రమాదముంది. ఈ బ్యాక్టీరియా కారణంగా శరీరం నియంత్రణ కోల్పోతుంది. పైరోనీషియా బ్యాక్టీరియా సెప్టిక్ ఆర్ధరైటిస్ వంటి వ్యాధికి కారణం కావచ్చు.
Also read: Onion Juice Benefits: ఉల్లిజ్యూస్‌తో కొవ్వు మంచు కరిగినట్టు కరగడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook