Constipation: మలబద్ధకం దూరం చేసే ఆరు అద్భుతమైన ఆహార పదార్ధాలివే
Constipation: మనిషి నిత్య జీవితంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఎదురౌతుంటాయి. శరీరంలో జరిగే అంతర్గత మార్పులు లేదా లోపాలు అనారోగ్య సమస్యలుగా బయటపడుతుంటాయి. ప్రతి ఆనారోగ్య సమస్యకు పరిష్కారం ప్రకృతిలో లభించే పదార్ధాల్లోనే ఉంటుంది. అలాంటి సమస్య మల బద్ధకం.
Constipation: ఇటీవలి కాలంలో మలబద్ధకం ప్రదాన సమస్యగా మారిపోయింది. దీనికి ప్రధాన కారణం మన ఆహారపు అలవాట్లే. ఆహారపు అలవాట్లు సక్రమంగా లేకుంటే ముఖ్యంగా ఆయిలీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ వంటివి వివిధ రకాల వ్యాధులకు కారణమౌతుంటుంది. శరీరంలో పోషకాల లోపం వల్లనే ఈ సమస్య తలెత్తుతుంటుంది.
ఆధునిక బిజీ ప్రపంచంలో చెడు ఆహారపు అలవాట్ల కారణంగా కొన్ని పోషకాలు లోపిస్తుంటాయి. ముఖ్యంగా జంక్ పుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ వంటివి క్రమం తప్పకుండా తీనడం వల్ల శరీరంలో ఫైబర్ లోపిస్తుంటుంది. దీనికితోడు వర్కవుట్స్ లేకపోవడం, నీళ్లు తక్కువగా తాగడం వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంటుంది. ముఖ్యంగా మలబద్ధకం ప్రధాన సమస్యగా మారుతుంది. ప్రకృతిలో లభించే సహజసిద్ధమైన విధానాలతో మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
శరీరానికి రోజూ కావల్సినంత పరిమాణంలో పాలు, నెయ్యి అవసరమౌతాయి. నెయ్యిలో బ్యూటిరిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఇంటెస్టైన్ మెటబోలిజంను వృద్ధి చేస్తుంది. మలాన్ని బయటకు త్యజించడంలో అద్భుతంగా దోహదపడుతుంది. మలబద్ధకం దూరం చేసేందుకు రోజూ ఒక కప్పు వేడి పాలలో ఒక స్పూన్ నెయ్యి కలుపుకుని తాగాల్సి ఉంటుంది.
రోజంతా తగిన పరిమాణంలో నీళ్లు తాగాల్సి ఉంటుంది. రోజూ తగిన పరిమాణంలో నీళ్లు తాగకపోతే మలబద్ధకం సమస్య దూరం కావచ్చు. రోజూ తగినన్ని నీళ్ళు తాగకపోతే కడుపు సంబంధిత సమస్యలు ఎదురౌతాయి. అందుకే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలను కూడా తీసుకుంటుండాలి.
పెరుగు కడుపు ఆరోగ్యాన్ని కాపాడటంలో అద్బుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే బిఫీడోబ్యాక్టీరియమ్ ల్యాక్టిస్ అనే ప్రోబయోటిక్ జీర్ణక్రియను మెరుగుపర్చడంలో కీలకంగా ఉపయోగపడుతుంది. ఇందులో కొద్దిగా ఫ్లక్స్ సీడ్స్ కలిపి తీసుకుంటే శరీరానికి కావల్సినంత సాల్యుబుల్ ఫైబర్ లభిస్తుంది. దీనివల్ల మలం మృదువుగా మారి సులభంగా బయటకు వస్తుంది.
శరీరానికి కావల్సిన మరో అద్భుత పదార్ధం ఉసిరి జ్యూస్. ఉసిరి జ్యూస్ తాగడం వల్ల మలబద్ధకం నుంచి ఉపశమనం కలుగుతుంది. చాలా సమస్యల్ని దూరం చేస్తుంది. ఉదయం పరగడుపున 30 మిల్లీగ్రాముల ఉసిరి జ్యూస్ నీళ్లలో కలిపి తాగడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి చాలా వేగంగా ఉపశమనం కలుగుతుంది.
పచ్చని ఆకు కూరలు క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. దీనికోసం బ్రోకలీ, పాలకూర, స్ప్రౌట్స్ వంటివి తప్పకుండా తీసుకోవాలి. ఇందులో పైబర్‌తోపాటు విటమిన్ సి, ఫోలేట్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంటెస్టైన్ పనితీరును మెరుగుపరుస్తుంది.
ఓట్స్ కూడా మలబద్ధకం సమస్యను, కడుపు సంబంధిత సమస్యలను అద్భుతంగా దూరం చేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ చాలా కీలకంగా ఉపయోగపడుతుంది. రోజువారీ డైట్‌లో తప్పకుండా ఉండేట్టు చూసుకోవాలి.
Also read: Coconut water: కొబ్బరి నీళ్ల వల్ల హెల్త్ బెనిఫిట్స్.. ఈ టైంలో తీసుకుంటే మాత్రమే శ్రేయస్కరం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook