Mouth Ulcers: ఇట్టే నోటిపూతను తగ్గించే ఇంటి చిట్కాలు..
మౌత్ అల్సర్లు లేదా నోటిపూత.. చిన్న సమస్య అయినప్పటికీ.. వీటి వలన తాగటానికి తినటానికి అవుతూ ఉంటుంది. వీటిని తగ్గించుకోటానికి అల్లోపతి మందులు కాకుండా ఇంట్లో ఉండే ఔషదాలతో ఉపశమనం పొందవచ్చు.
మౌత్ అల్సర్లు లేదా నోటి పూతగా పిలవబడే ఈ రుగ్మత అలెర్జీ, హార్మోన్లలో మార్పు, పొట్టలో ఇన్ఫెక్షన్ వంటి కారణాల వల్ల రావచ్చు. లేదా దంతాల వల్ల నోటి లోపల గుచ్చుకోడం, చెంప లోపలి వైపున కొరుక్కోవడం వల్ల కూడా అవుతాయి. వీటి నుండి ఉపశమనం పొందడానికి ఇంటి చిట్కాలను ఉపయోగించి తగ్గించుకోవచ్చు
నోటి లోపల అయ్యే మౌత్ అల్సర్ల వల్ల తినడం తాగడంలో ఇబ్బందిగా ఉంటుంది అవుతుంటాయి. ఇవి తక్కువ రోజులు ఉన్నపటికీ.. మౌత్ అల్సర్లతో పాటు జ్వరం కూడా ఉంటే అవి తగ్గడానికి కనీసం 3 వారాలు పడుతుంది. ఇవి దాదాపు వాటి అంతటా అవి నయం అవుతాయి. కడుపు నొప్పి, మలబద్దకం కారణంగా మౌత్ అల్సర్ల వస్తాయి. వీటికి చికిత్స అవసరమే లేదు.. కానీ తొందరగా వీటి నుండి ఉపశమనం పొందాలనుకుంటే కొన్ని ఇంటి చిట్కాల ద్వారా పొందవచ్చు.
తులసి ఆకులు
ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్కలు ఉంటాయి. తులసి మొక్కలు పర్యావరణానికి మాత్రమే కాకుండా మన శరీరానికి కూడా లాభదాయకం. తులసిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. తులసిని చాలా రోగాల చికిత్సలో ఉపయోగిస్తారు.రోజులో రెండు సార్లు 4-5 ఆకులని తినడం వల్ల నోటి పుండ్లను తగ్గించుకోవచ్చు
గసగసాలు
ఉదయాన్నే పడగడుపున ఒక చెంచా వేడి నీటితో గసగసాలను తాగడం వల్ల మౌత్ అల్సర్ల నుండి ఉపశమనం పొందవచ్చు
కొబ్బరి నూనె
కొబ్బరి నూనెతో కూడా ఈ మౌత్ అల్సర్లను తగ్గించుకోవచ్చు. కొబ్బరి నూనెను నీళ్లతో కలిపి తాగడం వలన ఈ మౌత్ అల్సర్లు తగ్గే అవకాశం ఉంది
ములేటి
ములేటి లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు నోటి పుండ్ల నుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి. ములేటి పొడిలో ఒక చెంచా తేనెని కలిపి నోటి పుండ్లపై అప్లై చేయడం వల్ల వాటి నుండి ఉపశమనం పొందవచ్చు
పసుపు
ప్రతి ఇంట్లో సులభంగా దొరికే పసుపు కూడా నోటి పుండ్లను తగ్గించవచ్చు. పసుపు యాంటీ సెప్టిక్ గుణాలను కలిగి ఉంటుంది. పసుపుని నీటితో కలిపి పేస్ట్ లా చేసి నోటి పుండ్లపై అప్లై చేసి 10 నిమిషాల తర్వాత నీటితో పుక్కిలించాలి. ఇలా చేయడం వల్ల మౌత్ అల్సర్లను తగ్గించుకోవచ్చు.
Also Read: Rushikonda Works: రుషికొండ నిర్మాణాలపై సర్వేకు ఏపీ హైకోర్టు ఆదేశాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..