వర్షాకాలం వచ్చిందంటే దోమల బెడదతో ఇబ్బందికరంగా ఉంటుంది. దోమల వల్ల జ్వరం వస్తుంది. డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాలు కూడా వస్తాయి. కనుక అలాంటి సమయాల్లో దోమలను తరిమికొట్టాలంటే ఈ చిట్కాలు పాటించండి. ఇవి చాలా సింపుల్. మీరూ ప్రయత్నిచండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

*  ఇంట్లో లేదా ఇంటి ప్రాగణంలో లేదా కిటికీల వద్దనో బంతిపూల మొక్కలను పెంచుకోండి. ఇలా చేయడం ద్వారా దోమల వ్యాప్తిని తగ్గించవచ్చు. ఈ మొక్కల నుండి వచ్చే వాసనకు దోమలు రావు.
 
*  గదిలో కిటీకీలు, తలుపులు మూసి 10 నిమిషాలు కర్పూరాన్ని వెలిగించండి. ఆ వాసనకు కూడా దోమలు ఇంట్లో ప్రవేశించవు.


*  వేప నూనె, కొబ్బరినూనెను కలిపి చర్మానికి పూస్తే దోమల బారి నుండి తప్పించుకోవచ్చు.
 
*   వెల్లుల్లి రసాన్ని నీళ్లలో కలిపి శరీరానికి పూసుకోవాలి.  ఇలా చేస్తే దోమలు కుట్టవు.


*  కిటికీల వద్ద తులసి మొక్కలను ఉంచితే దోమలు రావు. అలానే లావెండర్ ఆయిల్ తో వెలిగించిన దీపాలను గదుల్లో ఉంచినా దోమలు ఇంట్లో ప్రవేశించవు.
 
* ఇంటి పరిసరాలలో నీరు నిల్వవుండే మురికి గుంటలు లేకుండా చూసుకోవాలి. లేకుంటే దోమలు గుడ్లు పెడతాయి. ఇంట్లో వెలుతురు, గాలి బాగా వచ్చేలా వెంటిలేషన్ ఉండేట్లు చూసుకోవాలి.