Nephrotic Syndrome: మీ పిల్లలు తరచుగా అలసిపోతున్నారా..? అంతేకాకుండా ప్రోటీన్ లోపం, శరీరంలో మంట ఉంటే అస్సలు విస్మరించకూడదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలాంటి లక్షణాలు ఉంటే నెఫ్రోటిక్ సిండ్రోమ్ సమస్యలేనని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. నెఫ్రోటిక్ సిండ్రోమ్ అనేది ఒక సాధారణ కిడ్నీ సిండ్రోమ్ సమస్యని వైద్యుల పేర్కొన్నారు. పిల్లల్లో మూత్రపిండల సమస్యల వల్ల ఈ వ్యాధికి గురవుతున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ సమస్యలతో బాధపడే వారు మూత్రం నుంచి అధిక మొత్తంలో ప్రోటీన్ విసర్జిస్తారని నిపుణులు తెలుపుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సిండ్రోమ్ కారణంగా మూత్రపిండాల రక్త నాళాలు దెబ్బతినే ప్రమాదం పెరుగుతుంది. ఈ వ్యాధి ఏ వయస్సులోనైనా సంభవించవచ్చని నిపుణులు పేర్కొన్నారు. కానీ ఇది పిల్లలలో చాలా సాధారణం సంభవిస్తుందని అధ్యయానాలు చెబుతున్నాయి. దీని లక్షణాలు సాధారణమైనవి. దీని కారణంగా ఈ సిండ్రోమ్‌ను గుర్తించడం కొంచెం కష్టమవుతుందని వైద్యులు తెలుపుతున్నారు. కాబట్టి నెఫ్రోటిక్ సిండ్రోమ్ ప్రధాన లక్షణాలను ఇప్పుడు తెలుసుకుందాం.



నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?:


హెల్త్‌లైన్ నివేదికల ప్రకారం.. నెఫ్రోటిక్ సిండ్రోమ్ సాధారణంగా మూడు నెలల నుంచి ఆరు సంవత్సరాల మధ్య పిల్లలలో వచ్చే వ్యాధి. ఇది చిన్న పిల్లలో జ్వరం, జలుబు ద్వారా మొదలవుతుంది. దీని వల్ల మూత్రపిండాలలో రక్తనాళాలు గ్లోమెరులి అనే ద్రవంతో నిండిపోతాయి. ఆ తర్వాత  శరీరంలోని అదనపు నీరు, ప్రోటీన్ మూత్రం ద్వారా బయటకు వస్తాయి. దీని వల్ల శరీరంలో ప్రొటీన్‌ లోపం ఏర్పడుతుంది.


నెఫ్రోటిక్ సిండ్రోమ్ కారణాలు:


- శరీరంలో రక్తం సరిగ్గా ఫిల్టర్ కాకపోవడం
- మూత్రంలో అదనపు ప్రోటీన్ విసర్జన
- పెద్దలలో ఈ సిండ్రోమ్ మధుమేహం వల్ల కూడా రావొచ్చు
- వంశపారంపర్య కారణాల వల్ల కూడా రావొచ్చు


నెఫ్రోటిక్ సిండ్రోమ్ ప్రధాన లక్షణాలు:


- కళ్ల కింద వాపు
- ఉదయం ముఖం మీద వాపు
- బరువు పెరగడం
- మైకం
- ఆకలి లేకపోవడం
- నురుగు మూత్రం
- మూత్రంలో రక్తం
- అధిక రక్త పోటు


Also Read:  Health Benefits Of Egg Yolk : గుడ్డు పచ్చసొన తినడం వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..!


Also Read:  Monsoon Diet: వర్షాకాలంలో చైనీస్ ఫుడ్‌ తింటున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు..!


 



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook