Nerves Weakness Home Remedie: నరాల బలహీనతకు అద్భుతమైన చిట్కాల్లో ఇది ఒకటి.. దీనితో 12 రోజుల్లో నొప్పులు మాయం..
Rid Nerves Weakness In 12 Days: జీవనశైలిలో మార్పుల కారణంగా చాలామంది తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ముఖ్యంగా యువత నరాల బలహీనత రక్తనాళాల సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి ఎంత సులభంగా ఉపశమనం పొందితే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Rid Nerves Weakness In 12 Days: ఆధునిక జీవనశైలి కారణంగా చాలామంది బాధపడుతున్న అనారోగ్య సమస్యల్లో నరాల బలహీనత సమస్య కూడా ఒకటి. మన చుట్టుపక్కల నివసించే మన కుటుంబంలో ఉండే ఎవరికో ఒకరికి నరాల బలహీనత సమస్య ఉంటుంది. ఈ సమస్య కారణంగా శరీరం తీవ్ర నొప్పులతో కలిగి ఉంటుంది. చాలామందికి రక్తనాళాల సమస్య నరాల బలహీనత సమస్యకు మధ్య తేడాలు తెలీదు. రక్తనాళాలు శరీరమంతా రక్తాన్ని సరఫరా చేస్తే..నరాలు మాత్రం మెదడు ఇచ్చిన సందేశాన్ని అవయవాలకు చేరవేస్తాయి.
>>బలహీనత సమస్యతో బాధపడుతున్న వారు భవిష్యత్తులో తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమస్య నుంచి ఎంత సులభంగా ఉపశమనం పొందితే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
>>నరాల బలహీనత అనేది ఆధునిక జీవన శైలి కారణంగా రావచ్చు. లేదంటే తీసుకునే ఆహారంలో పోషకాలు లేకపోవడం వల్ల కూడా రావచ్చు. కాబట్టి నరాల బలహీనత సమస్య బారిన పడకుండా ఉండాలంటే తప్పకుండా పోషకాలు ఉన్న ఆహారాలు తీసుకోవాలి.
>>నరాల బలహీనత సమస్య కారణంగా మొదటగా వెన్నునొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకుండా మెదడులోని నరాలు కూడా చెడిపోయి. ఇతర తీవ్రవ్యాధులు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి నరాల బలహీనత లక్షణాలు ఉంటే తప్పకుండా వైద్యులను సంప్రదించాలి.
>>నరాల బలహీనత తో బాధపడుతున్న వారు తప్పకుండా విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ b6 పోషకాలు కలిగిన ఆహారాలను తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. అధిక పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకుంటేనే ఈ సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు.
>>బలహీనతతో బాధపడుతున్న వారికి విటమిన్ బి12 కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈ విటమిన్ అధికంగా ఉండే పుట్టగొడుగులు ఇతర కూరగాయలు ఆహారంలో తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also Read: Super Star Krishna Funeral: ఒకే ఫ్రేమ్‌లో సీఎం జగన్, బాలయ్య.. సూపర్ స్టార్ కృష్ణకు నివాళి
Also Read: SBI ATM Withdrawal: ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్.. క్యాష్ విత్ డ్రాకు రూల్ ఛేంజ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి