Omicron Variant: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సంక్రమణ వేగం పుంజుకుంది. ప్రపంచమంతా వణికిస్తోంది. ఇటు ఇండియాలో కూడా రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూ ఆందోళన కల్గిస్తోంది. దేశంలో ఒమిక్రాన్ సంక్రమణపై జినోమిక్స్ కన్సార్టియం ఏం చెబుతుందో పరిశీలిద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ అత్యంత వేగంగా వ్యాపిస్తూ భయం గొలుపుతోంది. ఇండియాలో ఒమిక్రాన్ కేసులు చాపకిందనీరులా వ్యాపిస్తున్నాయి. బెంగళూరులో 2 కేసుల నుంచి ప్రారంభమైన సంక్రమణ 150 వరకూ చేరింది. ప్రస్తుతం దేశంలో 12 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులున్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 54 కేసులు వెలుగు చూశాయి. రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 20 దాటడం గమనార్హం. మరోవైపు దక్షిణాఫ్రికా, యూకేలో ఒమిక్రాన్ సంక్రమణ ప్రమాదకరంగా మారింది. 


ఒమిక్రాన్ తీవ్రతపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)హెచ్చరికల నేపధ్యంలో అన్ని ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామమని ఇన్సాకాగ్(INSACOG)వెల్లడించింది. ఒమిక్రాన్ కేసులు సంఖ్య పెరుగుతున్నా...వ్యాధి తీవ్రత మాత్రం తక్కువగానే ఉందని తెలుస్తోంది. అయితే వ్యాధి తీవ్రత తక్కువగా ఉండటానికి కారణాలేంటనేది ఇంకా స్ఫష్టత లేదు. వ్యాక్సిన్ వల్లనా లేదా వేరియంట్ ప్రభావమే అంతనా అనేది తేలాల్సి ఉంది. అందుకే దేశంలో ఒమిక్రాన్ తీవ్రతను అంచనా వేసేందుకు మరికాస్త సమయం పట్టవచ్చని ఇన్సాకాగ్ అంచనా వేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron Severity)ప్రభావంపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఎక్కడికక్కడ కోవిడ్ ప్రోటోకాల్‌ను కఠినంగా అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్నవారిలో..తీసుకోనివారిలో ఒమిక్రాన్ (Omicron)తీవ్రత ఎలా ఉందనే విషయంపై ఇంకా వివిధ రకాల పరిశోధనలు జరుగుతున్నాయి. 


Also read: Best Immunity Food: రోగ నిరోధక శక్తిని పెంచే ఐదు ఆహార పదార్ధాలు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook