Papaya Precautions: సీజన్‌తో సంబంధం లేకుండా ఏడాది పొడుగునా లభించే పండ్లలో బొప్పాయి అత్యద్భుతమైంది. బొప్పాయి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. వైద్యులు కూడా బొప్పాయి తినమని సూచిస్తుంటారు. కానీ బొప్పాయి అందరికీ మంచిది కాదనే విషయం చాలామందికి తెలియదు. బొప్పాయి ఎవరెవరు తినకూడదు, తింటే ఎలాంటి సమస్యలు ఉత్పన్నమౌతాయో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రకృతిలో లభించే వివిధ రకాల పండ్లలో బొప్పాయి చాలా అద్భుతమైంది. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి, విటమిన్ కే, కాల్షియం, ఐరన్ ఇలా చాలా రకాల పోషకాలుంటాయి. అందుకే బొప్పాయి ఆరోగ్యానికి మంచిదంటారు. అయితే కొంతమందికి ముఖ్యంగా కొన్ని రకాల అనారోగ్య సమస్యలుండేవారికి బొప్పాయి మంచిది కాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 


ముఖ్యంగా ఎలర్జీ సమస్య ఉన్నవాళ్లు బొప్పాయికి దూరంగా ఉండాలి. ఎందుకంటే బొప్పాయిలోంచి వచ్చే పాలు అలర్జీకు కారణమౌతాయి. బొప్పాయిని గర్భిణీ మహిళలు తినకూడదు. ఇందులో ఉండే పపైన్ కారణంగా గర్భంలో శిశువుకు హాని కలుగుతుంది. పచ్చి బొప్పాయి అస్సలు తినకూడదంటారు. ఆరోగ్యానికి మంచిది కదా అనే ఉద్దేశ్యంతో కొంతమంది అదే పనిగా బొప్పాయి తింటుంటారు. పరిమితి దాటి బొప్పాయి తింటే గ్యాస్, కడుపు ఉబ్బరం, విరేచనాలు సమస్యలు పట్టుకుంటాయి.


బొప్పాయిలో విటమిన్ కె ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల రక్తం త్వరగా గడ్డకట్టుతుంది. రక్తం పలచబడే మందులు తీసుకునేవారు వైద్యుని సలహా మేరకు బొప్పాయి తీసుకోవల్సి ఉంటుంది. లేకపోతే లేనిపోని సమస్యలు కొనితెచ్చుకోవల్సి వస్తుంది. 


Also read: Honey with Garlic: రోజూ పరగడుపున ఈ మిశ్రమం తీసుకుంటే మెరుపువేగంతో బరువు తగ్గడం ఖాయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook