Papaya Disadvantages: బొప్పాయి పండు ఆరోగ్యనికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా ఈ పండులో అధిక శాతం ఫైబర్‌ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ పండు తీసుకోవడం వల్ల చర్మామనికి ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే కాకుండా ఈ బొప్పాయి తీసుకోవడం వల్ల  శ్వాస సంబంధిత సమస్యలు తొలుగుతాయని వైద్యలు చెబుతున్నారు. అయితే బొప్పాయి పండు కొన్ని వ్యతిరేక సమస్యలను కూడా తెస్తుంది నిపుణులు చెబుతున్నారు. అవి ఎలాంటి సమస్యలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 గర్భిణీ స్త్రీలు బొప్పాయి పండు తీసుకోవడం మంచిది కాదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా బొప్పాయి ఆకులు, విత్తనాలు తీసుకోవడం వల్ల పిండానికి హాని కలుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. బొప్పాయిలో ఫైబర్ కంటెంట్‌ ఎక్కువగా ఉండటం వల్ల కడుపు నొప్పి కూడా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా డీహైడ్రేషన్‌కు గురవుతారు.


అంతేకాకుండా బొప్పాయి పండును కిడ్నీ సమస్యతో బాధపడుతున్నవారు తీసుకోవడం మంచిది కాదు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌ వల్ల ఆ్సలేట్‌ సమస్య పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. రాళ్లు ఉన్నవారు బొప్పాయి పండుకు దూరంగా ఉండడమే  చాలా మంచిది.


ఇక అలర్జీలతో బాధపడే వారు కూడా బొప్పాయికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్‌ ఉన్నవారు బొప్పాయి పండుకు దూరంగా ఉండాలి. దీని వల్ల షుగర్‌ లెవల్స్‌ తగ్గించడంలో మందులు ఉపయోగిస్తున్నవారు ఈ పండును తినకుండా ఉండాలని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.


Also read: Garlic Benefits: రోజూ పరగడుపున 3-4 వెల్లుల్లి రెమ్మలు తింటే చాలు 3 వారాల్లో సన్నబడటం ఖాయం


గుండె నెమ్మదిగా, వేగంగా కొట్టుకుంటే బొప్పాయి పండును ఆసలు తీసుకోకుండా ఉండాలి. సైనోజెనిక్‌ గ్లైకోసైడ్ గుండె సమస్యలకు దారి తీస్తుంది ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.


ఆస్తమాతో బాధపడేవారు  బొప్పాయిని తీసుకోవడం వల్ల వీరికి కూడా స్కిన్ ఎలర్జీ, మిగతా సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.


హై ఫీవర్ ఉన్నప్పుడు ప్పాయి పండుని తినొద్దని చెబుతున్నారు నిపుణులు. ఇందులోని గుణాలు ఎలర్జీలకు కారణం అవుతాయని చెబుతున్నారు. 


ఈ విధంగా బొప్పాయి పండు నష్టాలను కూడా తీసుకువస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. మీరు కూడా ఈ సమస్యలు ఉన్నప్పుడు బొప్పాయి పండును తీసుకోకుండా ఉండాలి. ఒక వేళ మీరు ఇక్కడ చెప్పిన సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఈ పండు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.


Also read: Uses Of Nuts: ఈ గింజలు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలకు చెక్‌!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook