Papaya Benefits: అధిక బరువును తగ్గించేందుకు చాలామంది చాలా రకాలుగా ప్రయత్నించి విఫలమౌతుంటారు. బరువు తగ్గాలంటే కేవలం వ్యాయామం ఒక్కటే సరిపోదు. డైట్ కూడా చాలా ముఖ్యం. ప్రకృతిలో విరివిగా లభించే కొన్ని పండ్లతో అధిక బరువు సమస్యకు చెక్ చెప్పవచ్చంటున్నారు నిపుణులు. అదెలాగో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రకృతిలో సులభంగా లభించేది సీజన్‌తో సంబంధం లేకుండా మార్కెట్‌లో కన్పించేది బొప్పాయి. ఆరోగ్యపరంగా ఇది చాలా అద్భుతమైన ప్రయోజనాలు కలిగి ఉంటుంది. దాదాపు అన్ని రోగాలవారికి ఇది చాలా మంచిది. ఆఖరికి డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు సైతం హాయిగా తినగలిగే పండు ఇది. రోజూ క్రమం తప్పకుండా నెలరోజులు తింటే బరువు సులభంగా తగ్గించవచ్చంటున్నారు వైద్యులు. శరీరాన్ని ఫిట్ అండ్ హెల్తీగా ఉంచడంలో బొప్పాయి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ శరీరంలో అదనంగా పేరుకునే కొవ్వును కరిగించేందుకు ఉపయోగపడుతుంది. రోజూ వ్యాయామం చేస్తూనే బొప్పాయి తినడం అలవాటు చేసుకుంటే మంచి ఫలితాలు కన్పిస్తాయి. చాలా త్వరగా బరువు తగ్గించుకోవచ్చు.


బొప్పాయి తినడం వల్ల ఇందులో ఉండే ఫైబర్, డైజెస్టివ్ ఎంజైమ్స్ కారణంగా దీర్ఘకాలం కడుపు నిండినట్టు ఉంటుంది. దాంతో వెంటవెంటనే ఆకలేయదు. అందుకే రోజూ బ్రేక్ ఫాస్ట్ రూపంలో బొప్పాయి తింటే చాలా మంచిది. బరువు సులభంగా తగ్గించవచ్చు. సాయంత్రం వేళ స్నాక్స్ రూపంలో ఓ చిన్న గిన్నెడు బొప్పాయి ముక్కలు తినాల్సి ఉంటుంది. ఇలా నెలరోజులు క్రమం తప్పకుండా తినాలి. బొప్పాయి క్రమం తప్పకుండా తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఎప్పుడైతే జీర్ణ వ్యవస్థ బాగుంటుందో మెటబోలిజం వేగవంతమౌతుంది. దాంతో అధిక బరువు సమస్య తగ్గుతుంది. 


Also read: Diwali Lucky Signs: 500 ఏళ్ల తరువాత దీపావళిన గజకేసరి యోగం, 3 రాశులకు ధనయోగం, వద్దంటే డబ్బు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.