Peanut Benefits: రోజు వేరుశనగ తింటే ఏం జరుగుతుందో తెలుసా?
Peanut Benefits: ప్రతి రోజు వేరుశనగను తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులను తగ్గిస్తుంది.
Peanut Benefits In Telugu: ప్రస్తుతం చాలా మంది వ్యాయామాలు చేసేవారు వేరుశనగను తప్పకుండా ఆహారాల్లో తింటూ ఉంటారు. ఇది ప్రతి రోజు తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే ప్రోటీన్స్ ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. దీంతో పాటు ఇందులో ఉండే గుణాలు గుండె సమస్యలు, శరీర బరువు, ఎముకల సమస్యలను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇవే కాకుండా ప్రతి రోజు వేరుశనగలను తినడం వల్ల ఇతర లాభాలు కూడా కలుగుతాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వేరుశనగ తినడం వల్ల కలిగే 8 ప్రధాన లాభాలు:
గుండె ఆరోగ్యానికి మేలు:
వేరుశనగల్లో ఉండే గుణాలు మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిని పెంచి, చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిని తగిస్తాయి. అంతేకాకుండా గుండె జబ్బులు, స్టోక్ వంటి అనేక సమస్యల నుంచి విముక్తి కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇవే కాకుండా ఇతర లాభాలు కూడా కలుగుతాయి.
బరువు నియంత్రణ:
వేరుశనగల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది. దీంతో పాటు ఆకలి కూడా నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే పొట్ట నిండుగా ఉండే అనుభూతి కూడా కలుగుతుంది. ఇవే కాకుండా శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది.
ఎముకల ఆరోగ్యం:
వేరుశనగల్లో కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా చేసేందుకు ఆస్టియోపోరోసిస్ ప్రమాదాన్ని నివారించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
శక్తిని పెంచుతుంది:
వేరుశనగల్లో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇవే కాకుండా తక్షణ శక్తి కూడా లభిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
చర్మ ఆరోగ్యానికి మేలు:
వేరుశనగల్లో విటమిన్ E పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని తేమ అందించిది, ముడతలు రాకుండా శరీరాన్ని రక్షిస్తుంది. దీంత పాత చర్మ సమస్యలు కూడా దూరమవుతాయి.
మధుమేహాన్ని నియంత్రిస్తుంది:
వేరుశనగల్లో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా కండరాలు పెంచేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.