Peanut For Weight Loss And Diabetes: చాలామంది పెరుగుతున్న శరీరం బరువును నియంత్రించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కొందరు జిమ్ కి వెళ్లి గంటల తరబడి వ్యాయామాలు కూడా చేస్తున్నారు. ఆరోగ్య నిపుణులు సూచిస్తుంది ఏమిటంటే కేవలం బరువు తగ్గడానికి వ్యాయామాలే కాకుండా ఆహారంపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్లే శరీర బరువును సులభంగా నియంత్రించుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా శరీరానికి అవసరమైన పోషకాలు కలిగిన ఆహారాలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతేకాకుండా వేరుశనగతో తయారుచేసిన ఆహార పదార్థాలను ఉపయోగించి కూడా బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. వేరుశనగలో శరీరానికి కావాల్సిన ఫైబర్, ప్రోటీన్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా వీటిని ఆహారంలో తీసుకుంటే బరువు తగ్గడమే కాకుండా శరీరం దృఢంగా మారుతుంది. అయితే బరువు తగ్గడానికి వేరుశనగను ఎలా ఉపయోగించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..


బరువు తగ్గడానికి వేరుశెనగను ఎలా వినియోగించాలో తెలుసా..?:
వేరుశనగలు ఉండే గుణాలు శరీరంలోని కేలరీలను తగ్గించేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా ఇందులో ఫైబర్, ప్రోటీన్స్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి బరువు తగ్గడానికి మీరు అనుసరిస్తున్న డైట్ లో వేరుశనగతో చేసిన ఆహార పదార్థాలను ప్రతిరోజు తీసుకోవాల్సి ఉంటుంది. 


వేరుశనగలో ఆరోగ్యమైన కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ (MUFAలు), పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ (PUFAs) వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి వీటిని ప్రతి రోజు తినడం వల్ల ఊబకాయం గుండె సమస్యలు మధుమేహం ఇతర వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తి కూడా సులభంగా పెరుగుతుంది. కాబట్టి తరచుగా రోగ నిరోధక శక్తి సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతి రోజు వేరుశెనగను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.


వేరుశెనగ జీవక్రియను పెంచుతుంది:
వేరుశనగలు శరీరానికి శక్తినిచ్చే.. ఎన్నో రకాల మూలకాలు లభిస్తాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అయితే వాటిల్లో గ్లైసెమిక్ ఇండెక్స్  అధిక పరిమాణంలో లభిస్తుంది కాబట్టి రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించి మధుమేహం సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 


Also Read : Dhamaka Twitter Review : ధమాకా ట్విట్టర్ రివ్యూ.. అవుట్ డేటెడ్ స్టోరీ కానీ!


Also Read : 18 Pages Movie Twitter Review: 18 పేజెస్ ట్విట్టర్ రివ్యూ.. సినిమా హిట్టా, ఫట్టా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook